Moviesతూచ్..మా సినిమాలో ఆ హీరోయిన్ క్యాన్సిల్..ప్రభాస్ కోసం సూపర్ ఫిగర్..!!

తూచ్..మా సినిమాలో ఆ హీరోయిన్ క్యాన్సిల్..ప్రభాస్ కోసం సూపర్ ఫిగర్..!!

చాలామంది హీరోయిన్స్ కి ప్రభాస్ పక్కన నటించాలని ఉంటుంది . కానీ ఆ అవకాశం వచ్చినా సరే ఆయన పక్కన సూట్ అవ్వక హైట్ మ్యాచ్ అవ్వక ..రిజెక్ట్ అవుతూ ఉంటారు . అలాంటి లిస్టులోకే యాడ్ అయిపోయింది యంగ్ బ్యూటీ మెహ్రీన్. మనకు తెలిసిందే కృష్ణగాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది .

 

ఆ తర్వాత అరాకొరా సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాప్ లు అనే సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోయింది . దీంతో ఒక్కసారిగా నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి రెడీ అంటూ బిగ్ బాంబు పేల్చింది. అయితే ఏమైందో ఏమో తెలియదు నేను నా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాను అంటూ మరో ప్రకటన చేసింది. దీంతో మెహ్రీన్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయింది. కాగా బ్రేకప్ తర్వాత అందాల డోస్ పెంచేసిన మెహరీన్ ..ప్రభాస్-మారుతి కాంబోలో రాబోతున్న సినిమాలో మూడవ హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపించాయి.

కాగా రీసెంట్ సమాచారం ప్రకారం ..ఈ సినిమా నుంచి మారుతి ఆమెను తప్పించారట . దానికి మెయిన్ రీజన్ మెహరీన్ పొట్టిగా ఉండడం .ప్రభాస్ హైట్ గా ఉండడం మెహ్రీన్ చాలా బక్కగా ఉండడం,, ప్రభాస్ ధిట్టమైన బాడీ ముందు ఆమె ఆనకపోవడం తో రొమాన్స్ జనాలకు నచ్చదు అన్న కారణంతో డైరెక్టర్ మారుతి రిస్క్ తీసుకోలేక ప్రభాస్ పక్కన మెహరీన్ ని తప్పించారట.

అంతేకాదు ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీకి కొత్త ముద్దుగుమ్మను పరిచయం చేస్తున్నాడు. ఆశికా రంగనాథ్ అనే కన్నడ బ్యూటీని మారుతి ప్రభాస్ కోసం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ కోసం ఆశికా హైదరాబాద్ కి వచ్చినట్లు సమాచారం. మరి చూడాలి ఈ కొత్త ఫిగర్ ప్రభాస్ పక్కన ఏ రేంజ్ లో రొమాన్స్ చేసి ఆకట్టుకుంటుందో . మొత్తానికి ఈ సినిమా ఓ థియేటర్ చుట్టూ తిరిగే తాతా-మనవళ్ల కధ అని టాక్ వినిపిస్తుంది . హర్రర్ ప్లస్ కామెడీ ప్లస్ సస్పెన్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news