Moviesనాగార్జున హీరోయిన్‌కు టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ వేధింపులు... !

నాగార్జున హీరోయిన్‌కు టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ వేధింపులు… !

గ్రేసీ సింగ్ వల్లే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కొందరు టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు జంకుతున్నారా అంటే బ్యాక్ ఎండ్‌లో ఈ మధ్య ఇదే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా సంతోషం. ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది గ్రేసీ సింగ్. బాలీవుడ్‌లో నటించిన లగాన్ భారీ హిట్‌ సాధించడంతో నాగార్జున తెలుగులోకి తీసుకొచ్చారు. దశరథ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు.

ఇష్టం సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన శ్రియ శరణ్ ఇందులో కీలక పాత్రను పోషించింది. తెలుగులో గ్రేసీకి మొదటి సినిమా అయినా తన నటనతో అద్భుతంగా ఆకట్టుకొని టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు, తెలుగు హీరోయిన్‌గా కనిపించి ఆకట్టుకుంది. దాంతో వెంటనే తెలుగులో మంచు మోహన్ బాబు, శ్రీకాంత్ కాంబినేషన్‌లో తప్పుచేసి పప్పుకూడు అనే సినిమాలో నటించే అవకాశం అందుకుంది.

చెప్పాలంటే ఇలా మల్టీస్టారర్ సినిమాలో ఛాన్స్ అంటే టాలీవుడ్‌లో గ్రేసీసింగ్ స్టార్ హీరోయిన్ అయినట్టే అనుకున్నారు. కానీ, తను అనుకున్నట్టుగా మాత్రం జరగలేదు. దీనికి కారణం ఇక్కడ గ్రేసీసింగ్ పడిన ఇబ్బందులే అని లోలోపల టాక్ వినిపించింది. ఇక్కడ చేసిన ఈ రెండు సినిమాల యూనిట్ సభ్యులలో కొందరు ఆమెని ఇబ్బందులు పెట్టారట. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కాస్టింగ్ కౌచ్ అనుకోవచ్చు.

కొత్త హీరోయిన్ అంటే అందరూ ఎలా ఎగబడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా గ్రేసీసింగ్ మీద కూడా ఎగబడి తనని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారట. దానివల్లే గ్రేసీసింగ్‌కి టాలీవుడ్ అంటే విరక్తి కలిగి ఇక్కడ సినిమాలంటేనే వద్దురా బాబూ అనేలా సమాధానం చెప్పిందట. గ్రేసీసింగ్ మాత్రమే కాదు..అంతకముందు కూడా కొందరు బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ సినిమా అంటే నో అనేసిన సందర్భాలున్నాయి.

అలాంటి వారిలో సోనాక్షి సిన్హా కూడా ఉందట. గతంలో చాలాసార్లు సోనాక్షి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి. మన మేకర్స్ కూడా సంప్రదించారట. కానీ, గ్రేసీ అనుభవంతో నో అనేసినట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news