Moviesహైపర్ ఆది నోటి దూల .. మల్లెమాల బిగ్ వార్నింగ్..!?

హైపర్ ఆది నోటి దూల .. మల్లెమాల బిగ్ వార్నింగ్..!?

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షో నుంచి స్టార్ కమెడియన్స్ అందరూ వేరే ఛానల్స్ కి వెళ్ళిపోయి.. అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్‌స్ లో ప్రత్యక్షమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అలా చాలామంది వెళ్ళిన స్టార్స్ కొందరు మళ్ళీ తిరిగి జబర్దస్త్ లోకి వచ్చేలా చేసుకున్నారు షో మేనేజర్ ఏడుకొండలు. అయితే కొందరు మాత్రం అలా తిరిగి రాలేదు. పౌరుషంగా అక్కడే ఉంటూ జబర్దస్త్ షోని మించి పోయే లా కొత్త షోలు రావడానికి ట్రై చేస్తున్నారు.

కాగా ఈ క్రమంలోనే ప్రముఖ ఛానల్ ఈటీవీలో వర్క్ చేస్తున్న స్టార్ కమెడియన్స్ ని.. ఆ షో లో పని చేస్తున్న జడ్జిలని మెల్ల మెల్లగా వాళ్ళ వైపులా తిప్పుకునే లా భారీ ఆఫర్స్ తో టెంప్ట్ చేస్తుంది ఓ స్టార్ ఛానెల్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ క్రమంలోనే జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా ఉంటున్న హైపర్ ఆది పై ఆ ఛానల్ కళ్ళు పడ్డాయట . దీంతో అతనికి భారీ రేంజ్ లో పారితోషకం ఆఫర్ చేస్తూ ఈటీవీ ని వదిలి వచ్చేసి మా ఛానల్ లో పనిచేయాలి అంటూ సదరు బిగ్ ఛానల్ హైపర్ ఆదిను కోరిందట.

అయితే హైపర్ ఆది యస్, నో రెండు చెప్పకుండా.. ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి అన్నట్లు చెప్పుకొచ్చారట. ఈ క్రమంలోనే మ్యాటర్ తెలుసుకున్న మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ హైపర్ ఆదిని పర్సనల్గా పిలిచి వార్నింగ్ ఇచ్చిందట . అంతేకాదు నువ్వు షో వదిలి వెళ్ళడానికి వీల్లేదు..అగ్రిమెంట్ పేపర్స్ పై సైన్ చేసావ్ గుర్తుంది కదా అంటీ హెచ్చరిచిందట. అంతేకాదు.. నీకు ఎంత కావాలన్నా మేము ఇస్తామంటూ ..వాళ్లకు మించిపోయి ఆఫర్ ను ఇవ్వడానికి సిద్ధపడిన్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే హైపర్ ఆది సందిగ్ధంలో మునిగిపోయాడట . అయితే హైపర్ ఆది ఫాన్స్ మాత్రం జబర్దస్త్ లోనే ఉండు అంటూ ఆయన కు సలహా ఇస్తున్నారు. అయితే ఇప్పటికే హైపర్ ఆది పలు సందర్భాల్లో ఆ ఛానల్లో మెరిసిన సంగతి తెలిసిందే . దీంతో హైపర్ ఆది ఆ ఛానల్ లోకి వెళ్తాడా లేక ఈ ఛానల్ లోనే ఉంటాడా లేదా.. గోడ మీద పిల్లిలా అటు ఇటు మారుతూ ఉంటాడా..? అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. మరి చూడాలి హైపర్ ఆది ఏం చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news