Moviesటాలీవుడ్ కుర్ర హీరోలను కోరిక తీర్చాల‌ని వేధించే లేడీ ప్రొడ్యుస‌ర్‌...!

టాలీవుడ్ కుర్ర హీరోలను కోరిక తీర్చాల‌ని వేధించే లేడీ ప్రొడ్యుస‌ర్‌…!

సినిమా రంగంలో హీరోయిన్ల‌ను కోరిక తీర్చాల‌ని వేధించే ద‌ర్శ‌కులు, హీరోలు ఉండ‌డం కామ‌న్‌. కొంద‌రు నిర్మాత‌లు సైతం కొత్త హీరోయిన్ల‌కు ఛాన్సులు ఇవ్వాలంటే త‌మ ప‌క్క‌లో పొడుకోవాల‌న్న కండీష‌న్లు పెడుతుంటారు. అమాయ‌క‌పు అమ్మాయిలు దొరికితే ఆమెను క‌లిసి వాడుకునే హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు కూడా టాలీవుడ్లో ఉన్నారు. వారి వ‌ల‌కు చిక్కితే చాలు ఎలాంటి అమ్మాయిని అయినా సింపుల్‌గా ముగ్గులోకి దింపేసి ర‌క‌ర‌కాలుగా వాడేసుకుంటారు.

ఇలా మోస‌పోయిన అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. ఇప్ప‌ట‌కీ మోసపోతూనే ఉంటున్నారు. అన్నింటికి మించి కాస్టింగ్ కౌచ్ అన్న‌ది బ‌య‌ట‌కు వ‌చ్చాక చాలా మంది అమ్మాయిలు త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌తో పాటు, తాము ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి ఓపెన్ అవుతున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో లేడీ ద‌ర్శ‌కులుగా పేరున్న వాళ్లు కూడా కుర్ర హీరోల‌ను కోరిక తీర్చాల‌ని టార్చ‌ర్ పెట్టిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ట‌.

ఆ మ‌హిళా ద‌ర్శ‌కురాళ్ల పేర్లు ఇక్క‌డ అన‌వ‌స‌రం కాని.. ఆ మ‌హిళా ద‌ర్శ‌కురాళ్లు త‌మ డైరెక్ష‌న్‌లో న‌టించిన కుర్ర హీరోల‌ను కోరిక తీర్చాల‌ని టార్చ‌ర్ పెట్టేవార‌న్న టాక్ అప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఓ కుర్ర హీరో చివ‌ర‌కు ఆ మ‌హిళా ద‌ర్శకురాలి వేధింపులు త‌ట్టుకోలేక ఆమె చెప్పిన‌ట్టే చేశాడ‌న్న పుకార్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓ మ‌హిళా ప్రొడ్యుస‌ర్ కూడా కుర్ర హీరోల‌తో సినిమాలు చేస్తూ ఉంటోంది.

ఈ క్ర‌మంలోనే త‌మ‌కు సినిమా ఛాన్స్ వ‌చ్చింద‌ని ఆశ‌తో ఓకే చెప్పిన కుర్ర హీరోల‌కు వెంట‌నే క‌మిట్‌మెంట్ ఉంటుంద‌ని చెప్ప‌డంతో షాక్ అవుతున్నార‌ట‌. క‌మిట్‌మెంట్ డైరెక్టుగా మ‌హిళా ప్రొడ్యుస‌ర్‌కే ఇవ్వాల‌ని అడుగుతుండ‌డంతో సినిమా ఛాన్స్ వ‌చ్చింద‌ని ఆనంద ప‌డాలో.. త‌మ‌తో ఇలాంటి ప‌నులు చేయిస్తున్నార‌ని బాధ‌ప‌డాలో తెలియ‌క ఇద్ద‌రు కుర్ర హీరోలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌.

నాలుగైదేళ్ల క్రితం ఓ కుర్ర హీరోకు హిట్ ఇచ్చిన ఓ యంగ్ డైరెక్ట‌ర్‌ను సైతం ఆ సినిమా ప్రొడ్యుస‌ర్ అయిన మ‌హిళ కోరిక తీర్చాల‌ని వేధించ‌డంతోనే ఆ ద‌ర్శ‌కుడికి, ఆ సినిమా హీరోకు మ‌ధ్య గ్యాప్‌న‌కు కార‌ణ‌మైంద‌ని టాక్ ? ఏదేమైనా దీనిని బ‌ట్టి టాలీవుడ్లో హీరోయిన్లను వాడుకోవ‌డ‌మే కాదు.. కుర్ర హీరోల‌ను కూడా వాడుకునే మ‌హిళా ద‌ర్శ‌కురాళ్లు, మ‌హిళా నిర్మాత‌లు కూడా ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news