Moviesఅలా చేసాను కాబట్టే..పెద్ద హీరోలు అవకాశాలు ఇచ్చారు..బిగ్ బాంబ్ పేల్చిన నిధి...

అలా చేసాను కాబట్టే..పెద్ద హీరోలు అవకాశాలు ఇచ్చారు..బిగ్ బాంబ్ పేల్చిన నిధి అగర్వాల్..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావడం అంత ఈజీ మేటర్ కాదు. అది సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోయిన్స్ ఎవరిని అడిగిన చెప్పే మాటే. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అన్నా వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు దక్కించుకోవాలి అన్నా.. సినిమా హిట్ కొట్టాక ఆ పేరు పది కాలాలపాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అన్న దాని వెనక ఎంతో కష్టం, కృషి, సాహసాలు ఉండాలి. అయితే కొందరు ముద్దుగుమ్మలకి అదృష్టం బ్యాక్ పాకెట్ లో ఉన్నట్లు ఉంటుంది. పెద్దగా కష్టపడకపోయినా తమ టాలెంట్ తో మాయ చేసి ఎలాగోలా దర్శక నిర్మాతలను మెల్ట్ చేసేస్తారు. ఆలిస్టులోకే వస్తుంది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్.

అమ్మడు పేరుకు కొత్త పరిచయాల అవసరం లేదు . తెలుగు, తమిళ్ సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది .నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ నిధి అగర్వాల్.. ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను.. ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది .అయితే అందం అభినయం ఉన్నా కానీ ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేకపోయాయి. దీంతో కోలీవుడ్ సైడ్ అడుగులు వేసింది . కోలీవుడ్లో మాత్రం స్టార్ హీరోయిన్ లిస్టులోకి వెళ్ళిపోయింది.

కాగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిధి అగర్వాల్ తనకు కోలీవుడ్ స్టార్ హీరోలు ఎందుకు అవకాశం ఇచ్చారు చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు తను సినిమా ఇండస్ట్రీలో ఇంకా హీరోయిన్గా ఎందుకు కొనసాగుతున్నాను తనకి ఇప్పటికీ అవకాశాలు ఎలా వస్తున్నాయో చెప్పి బిగ్ బాంబ్ పేల్చింది. నిధి అగర్వాల్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ..” సినీ ఇండస్ట్రీలో టాలెంట్ చూసి అవకాశాలు ఇస్తారన్నది నేను నమ్మడం లేదు. కేవలం అందమే చూస్తారు . ఈ గ్లామరస్ ప్రపంచంలో గ్లామర్ గా ఉంటేనే అందాల ఆరబోస్తేనే అవకాశాలు ఇస్తారు . ఎవరో వందలు ఇరవై శాతం మంది మాత్రమే టాలెంట్ చూస్తారు .

అయితే నాలాంటి హీరోయిన్ కి స్టార్ హీరోల సినిమాలో అవకాశం ఎలా దక్కింది అంటే మాత్రం ఖచ్చితంగా రెమ్యూనరేషన్ అని చెప్తాను. నేను పారితోషం ని డిమాండ్ చేయను . వాళ్లు ఇచ్చింది తీసుకుంటాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు అన్నిటిలోనూ అలాగే జరిగాయి . అయితే నేను మేకర్స్దగ్గర విన్న మాటలు ప్రకారం నా కన్నా ముందు ఈ సినిమాకు హీరోయిన్స్ గా అప్రోచ్ అయినవాళ్లు ఎక్కువగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట ..ఆ కారణంగానే వాళ్ళు రిజెక్ట్ చేశారు ,,నాకు వచ్చాయి. సినీ ఇండస్ట్రీలో మనీ కూడా మోర్ ఇంపార్టెంట్ “అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం నిధి అగర్వాల్ ఓ సినిమాకి కేవలం 30 నుండి 50 లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్ గా అందుకుంటుందట . నిజానికి వేరే హీరోయిన్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news