Moviesఆ టాలీవుడ్‌ హీరో వల్లే హీరోయిన్ అంకిత కెరీర్ నాశనం... షూటింగ్...

ఆ టాలీవుడ్‌ హీరో వల్లే హీరోయిన్ అంకిత కెరీర్ నాశనం… షూటింగ్ లోనే అలాంటి పనులు చేయడంతో…!

సినిమా ఇండ‌స్ట్రీలో లైంగిక వేధింపులు ఉంటాయ‌ని చాలా మంది హీరోయిన్ లు బ‌య‌ట‌పెట్టారు. అయితే ప్ర‌తి ఒక్క‌రూ వేధింపుల‌కు గురికాక‌పోవ‌చ్చు గానీ చాలా మంది తాము ఇబ్బంది ప‌డిన‌ట్టు చెప్పిన సంధ‌ర్బాలు ఉన్నాయి. ఇక వేధింపుల‌ను త‌ట్టుకోలేక సినిమా ఇండ‌స్ట్రీకే దూరమైన హీరోయిన్ లు కూడా చాలా మంది ఉన్నారు. ఇక హీరోయిన్ అంకిత జ‌వేరి కూడా ఒక‌ప్పుడు ఓ హీరో వ‌ల్ల వేధింపులు ఎదురుకున్న‌ట్టు అప్ప‌ట్లో టాలీవుడ్ లో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అంకిత అంటే గుర్తుప‌ట్ట‌క‌పోవ‌చ్చు కానీ సింహాద్రి సినిమా హీరోయిన్ అంటే చాలా మందికి గుర్తుకు వ‌స్తుంది.

అంకిత ఎన్టీఆర్ హీరోగా న‌టించిన సింహాద్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంత‌కు ముందు చిన్నా చిత‌కా సినిమాలు చేసిన అంకితకు సింహాద్రితో మంచి పాపులారిటీ వ‌చ్చింది. అయితే ఆ క్రేజ్‌ను ఆమె అంది పుచ్చుకోలేక స్టార్ హీరోయిన్ అయితే కాలేక‌పోయింది. అంతే కాకుండా అంకిత తెలుగులో లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో మొద‌టిసారి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటూ ఈ బ్యూటీ త‌మిళ‌, క‌న్నడ చిత్రాల‌లోనూ న‌టించి అభిమానుల‌ను సంపాదించుకుంది. అంకిత చిన్న‌ప్పుడే ర‌స్నా టీవీ యాడ్ లో సందడి చేసింది కానీ ఆ పాపే హీరోయిన్ అంకిత అని చాలా మందికి తెలియ‌దు.

ఇదిలా ఉండ‌గా టాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్న స‌మ‌యంలో అంకిత లైంగిక వేధింపుల‌కు గురి అయిన‌ట్టు ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. అంకిత విఎన్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో మ‌న‌సు మాట విన‌దు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో న‌వ‌దీప్ హీరోగా న‌టించాడు. కాగా ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో త‌న‌ను హీరో న‌వ‌దీప్ వేధిస్తున్నాడ‌ని అంకిత ప్రొడ్యూస‌ర్ల‌కు ఫిర్యాదు చేసింది.

అయిన‌ప్ప‌టికీ న‌వ‌దీప్ పై ప్రొడ్యూస‌ర్ లు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ట. అంతే కాకుండా తిరిగి అంకిత పై బ్యాన్ విధించార‌ట‌. దాంతో అంకిత చాలా ఇబ్బందులు ఫేస్ చేశార‌ట‌. అప్ప‌ట్లో ఈ విష‌యం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పుడు అంకిత సినిమాల‌కు పూర్తిగా దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. సినిమాల్లో న‌టిస్తున్న స‌మ‌యంలోనే అంకిత విశాల్ జ‌గ‌త్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. ప్ర‌స్తుతం భ‌ర్త‌తో క‌లిసి విదేశాల్లో ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news