Moviesబాలకృష్ణ ను ఆయన మనవళ్లు ఏమని పిలుస్తారో తెలుసా.. అస్సలు గెస్...

బాలకృష్ణ ను ఆయన మనవళ్లు ఏమని పిలుస్తారో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనదైన స్టైల్ లో సినిమాలను చూస్ చేసుకుంటూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో హోస్ట్ అవతారం ఎత్తారు. ఇప్పటివరకు నటుడిగా ప్రొడ్యూసర్ గా చూసిన బాలయ్యను ఎవరు చేయని సాహసాన్ని అల్లు అరవింద్ చేసి బాలకృష్ణను యాంకరింగ్ చేయడానికి ఒప్పించి ఫస్ట్ టైం ఓటీటీ వేదికలో టాక్ షోను ప్లాన్ చేసి సంచలనానికి తెరలేపారు. అంతేకాదు అన్ స్టాపబుల్ టాక్ షో తో బాలయ్య క్రేజ్ రేంజ్ డబుల్ అయిపోయాయి. మరీ ముఖ్యంగా ఆహాకు సబ్స్క్రైబర్లు పెరిగిపోయారు.

అన్ స్టాపబుల్ షో సీజన్ వన్ ఎంతటి గ్రాండ్ సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు .ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ షో సీజన్ 2 గ్రాండ్ గా ప్లాన్ చేశారు . ఈ క్రమంలోని అన్ స్టాపబుల్ షో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా జరిపించారు :ఆహా”. ఈ ఈవెంట్లో బాలయ్య మాట్లాడుతూ సినిమా విషయాలనే కాకుండా తన కుటుంబ విషయాలను కూడా రివీల్ చేసి అభిమానులకు కొత్త ఊపునిచ్చారు. తాను సినిమాల్లో బిజీగా ఉంటే తన భారీ వసుంధర నే ఫ్యామిలీని లీడ్ చేసిందని.. నేను కాదు నా భార్య వసుంధర అన్ స్టాపబుల్ అంటూ క్రేజీ కామెంట్స్ చేశాడు బాలయ్య ,

అంతేకాదు సీజన్ 2 లో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున కూడా వస్తారని.. వాళ్ళ వాళ్ళ టైం చూసుకుని కచ్చితంగా నా షో కి వస్తారంటూ అభిమానులకు క్రేజీ అప్డేట్ ఇచ్చారు . అంతేకాకుండా తొలి సీజన్ తో కంపేర్ చేస్తే సెకండ్ సీజన్ మరింత బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని . డిఫరెంట్ గా ప్లాన్ చేసామని ..ఈసారి అంతా దబిడి దిబిడే అంటూ బాలయ్య తనదైన స్టైల్ లో కామెంట్ చేశాడు. ఇక చివరిలో యాంకర్ వచ్చి బాలయ్యను మామయ్య అని పిలవచ్చా అంటూ అడగ్గా..దీంతో బాలయ్య తనదైన స్టైల్ స్పందిస్తూ.. ” నా మనవళ్లు నన్ను తాతయ్య అని పిలవరు.. నువ్వు మావయ్య అని పిలుస్తావా..?” అనగా… అప్పుడు యాంకర్ “మీ మనవళ్లు మిమ్మల్ని ఏమని పిలుస్తారు” అని అడగ్గా.. ” బాలా” అంటూ ముద్దుగా పిలుస్తారని చెప్పుకొచ్చాడు . దీంతో బాలకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news