Moviesవామ్మో..సమంతకు వచ్చిన ఈ వ్యాధి ఎంత భయంకరమైనదో తెలుసా..ప్రాణాలకే ప్రమాదం..!!

వామ్మో..సమంతకు వచ్చిన ఈ వ్యాధి ఎంత భయంకరమైనదో తెలుసా..ప్రాణాలకే ప్రమాదం..!!

మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధితో బాధపడుతుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉన్న సమంత ఏమైపోయింది ..ఎందుకు సోషల్ మీడియాకి దూరంగా ఉందా ..? అంటూ అభిమానులు చర్చించుకుంటూ వచ్చారు. కాగా నిన్న సాయంత్రం తాను మయోసైటిస్ అనే వింత వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా ప్రకటించింది సమంత.

దీంతో ఒక్కసారిగా సమంత ఫ్యాన్స్ షాక్ అయ్యారు . సినీ ఇండస్ట్రీ లో ఉండే ఆమె బెస్ట్ ఫ్రెండ్స్ బాధపడ్డారు . ఇప్పటివరకు సమంత ఈ వ్యాధితో బాధపడుతుందని ఎవ్వరికీ తెలియదు నిన్న అభిమానులకి తన వ్యాధి గురించి చెప్పుకు రావడంతో ఆ వ్యాధి ఏంటి..? అది అంత ప్రమాదమా..? అసలు ఆ వ్యాధి ఎలా వస్తుంది ..? ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి..? అన్న విషయాలను జనాలు సోషల్ మీడియా ద్వారా గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు.

ఆటో ఇమ్యూన్ కారణంగా శరీరంలో ఏర్పడే కొన్ని లక్షణాలు కలయికను మమోసైటీస్ అని పిలుస్తుంటారు. నిజానికి ఈ మమోసైటీస్ మూడు రకాలుగా ఉంటుంది . అయితే సమంత ఏ రకం సైంటిస్ట్ కారణంగా బాధపడుతుందో చెప్పుకు రాలేదు . అయితే మమోసైటిస్ జబ్బుతో బాధపడే వాళ్లకు కండరాల నొప్పి ఎక్కువగా ఉంటుందట . మరిముఖ్యంగా 10 నిమిషాలు నిల్చున్న వెంటనే అలసిపోవడం ..ఒళ్లంతా చెమటలు పట్టేయడం.. కండరాలు విపరీతంగా నొప్పి పుట్టడం లాంటివి వస్తుంటాయట.

ఈ వ్యాధి మరింత ముదిరిపోతే నడుస్తున్న టైం లోనే ఎక్కడ అంటే అక్కడే కళ్ళు తిరిగి పడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయట . అయితే అది సరైన టైంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదం లేదని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఐదేళ్లలోనే వీల్ చైర్ కి పరిమితం కావాల్సి వస్తుందని ..మరింత ముదిరిపోతే ప్రాణాలే వదిలేసే పొజీషన్ వస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. ఏదేమైనా సరే సమంత భయంకరమైన వ్యాధితో బాధపడుతుంది అన్నది మాత్రం వాస్తవం . సమంత అభిమానులు త్వరగా ఆమె ఆరోగ్యంగా కోలుకోవాలని సినిమాలు చేయాలని దేవుని ప్రార్థిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news