Moviesపడుకుంటే లక్ష ఇస్తా అన్నాడు.. ఆ నిర్మాత బండారం బయటపెట్టిన బిగ్...

పడుకుంటే లక్ష ఇస్తా అన్నాడు.. ఆ నిర్మాత బండారం బయటపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ….!

ముగ్గురు మొనగాళ్లు, ది రోజ్ విల్లా, మిఠాయి లాంటి సినిమాల్లో నటించిన శ్వేత వర్మ బిగ్ బాస్ సీజన్ -5 లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే శ్వేతావర్మ నటించినవి చిన్న సినిమాలు కావడం … హిట్ అవ్వకపోవడంతో ఆశించినమేర విజయాలు అందుకోకపోవడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ బిగ్ బాస్ సీజన్ 5 లో 18వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి చాలామంది అభిమానులకు పరిచయమైంది. బిగ్ బాస్ లో లేడీ అర్జున్ రెడ్డిగా పేరు సంపాదించుకుంది. ఎవ్వరి జోలికి వెళ్లకుండా తన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోకుండా కనిపించే శ్వేత వర్మ ఆటిట్యూడ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.

కానీ శ్వేతా వర్మ ఎక్కువ కాలం హౌస్‌లో ఉండలేకపోయింది. అంతేకాకుండా శ్వేత వర్మ కెరిర్ బిగ్ బాస్ కు ముందు ఆ తరవాత అని చెప్పాలి. బిగ్ బాస్ తరువాత కూడా శ్వేత వర్మ కొన్ని సినిమాల్లో నటించినా ఆశించిన విజయం అందుకోలేదు. ఇది ఇలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలా మంది తాము కాస్టింగ్ కౌచ్ భారిన పడిపోయామంటూ ఫిర్యాదులు చేశారు. కాగా ఓ ఇంటర్వ్యూలో శ్వేత వర్మ కూడా కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపింది.

2013 సంవత్సరంలో తాను షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్నానని తెలిపింది. ఆ సమయంలో ఓ దర్శకుడు తనను కాంటాక్ట్ అయ్యాడని చెప్పింది. అప్పుడు ఆ డైరెక్టర్ తనను కమిట్మెంట్ అడిగాడని చెప్పింది. కానీ ఆ సమయంలో కమిట్మెంట్ అంటే తెలియదని పేర్కొంది. ఆ తర్వాత రెండు లక్షలు ఇస్తా వస్తావా అని అడిగాడని శ్వేత వర్మ సంచలన నిజాలు బయటపెట్టింది.ఆ సమయంలో తనకు చాలా కోపం వచ్చింది అని చెప్పింది. ఆ డైరెక్టర్ ను ఒకటి చేస్తారా అని అడిగానని పేర్కొంది. ఆ తరవాత బిల్డింగ్ పైనుంచి దూకండి పీడా పోతుంది అంటూ కోపంగా చెప్పానని తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news