Moviesనన్ను అవి చూసే తీసుకుంటున్నారు ... వకీల్ సాబ్ అన‌న్య‌ ఓపెన్...

నన్ను అవి చూసే తీసుకుంటున్నారు … వకీల్ సాబ్ అన‌న్య‌ ఓపెన్ కామెంట్స్…!

మల్లేశం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ అనన్య నాగళ్ళ. మొదటి సినిమాలో అందం, అభినయంతో అనన్య నాగళ్ల ఆకట్టుకుంది. ఈ సినిమాలో అచ్చమైన తెలంగాణ అమ్మాయిలా కనిపించి తన నటనతో మెప్పించింది. ఈ సినిమాలో అనన్య తన నటనకు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అయినా ఆశించిన అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.

కానీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురు యువతుల్లో ఒక పాత్ర చేసి చాలా పాపులారిటీని సంపాదించుకుంది. వకీల్ సాబ్ లో తన పాత్ర చిన్నదే అయినా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ సినిమా తర్వాత అనన్య నాగళ్లను వకీల్ సబ్ బ్యూటీ అని పిలవడం ప్రారంభమైంది. ఈ సినిమా తర్వాత వెబ్ సిరీస్ లతోపాటు సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

మరోవైపు సోషల్ మీడియాలో ఈ అమ్మడి కి చాలా ఫాలోయింగ్ ఉంది. మల్లేశం సినిమాలో చాలా డీసెంట్ గా కనిపించిన అనన్య ప్రస్తుతం అందాలు ఆరబోస్తోంది. బోల్డ్ ఫొటోల‌తో మామూలు ర‌చ్చ చేయ‌ట్లేదు. సోషల్ మీడియాలో ఫోటోలు… వీడియోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఈ అమ్మడి ఫిజిక్ కు చాలామంది అభిమానులు ఉన్నారు. అనన్య ఎప్పుడు తన ఫోటో పెట్టినా ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి.

ఇదిలా ఉండగా అనన్య ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. యాంకర్ ఇండస్ట్రీలో కాస్ట్ ఉంటుందా ? అని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పింది. తనకు తెలుగు స్పష్టంగా వస్తుందని మరియు తన నటన చూసి మాత్రమే తనకు సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారని చెప్పింది. అంతేకాకుండా తనకు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనుభవం లేదని వెల్లడించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news