Movies"కొవ్వు బాగా పెరిపోయింది".. అనసూయ పోస్ట్ వైరల్..!!

“కొవ్వు బాగా పెరిపోయింది”.. అనసూయ పోస్ట్ వైరల్..!!

సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . న్యూస్ రీడర్ గా తన కెరియర్ను స్టార్ట్ చేసిన అనసూయ ..ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మారింది . అంతేకాదు బుల్లితెరపై యాంకర్ గా చేస్తూనే సినిమాలో అవకాశాలు సంపాదించుకుంటూ తనదైన స్టైల్ లో నటించిన మెప్పించి అలరించింది.

 

మరీ ముఖ్యంగా అనసూయ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవాల్సింది రంగస్థలం సినిమా. రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది అనసూయ. రంగమ్మత్తగా అనసూయ చేసిన పర్ఫామెన్స్ చూసిన జనాలు ఆమెలో ఇంత టాలెంట్ ఉందా అంటూ అనసూయను పొగిడేసారు. అనసూయ లోని నటనకు మెచ్చిన సుకుమార్ ఆమెతో మరో సినిమా చేశాడు.

పుష్ప సినిమాలో ఆమెకు దాక్షాయిని అనే పాత్రను ఇచ్చాడు. కాగా పుష్ప 2 లో కూడా అనసూయ నటిస్తుంది. రీసెంట్గానే జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసిన యాంకర్ అనసూయ ప్రజెంట్ అమెరికాలో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. కాగా అక్కడ తన ఫ్రెండ్స్ తో చిల్ అవుట్ అవుతున్న పిక్స్ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ అభిమానులకు కొత్త ఊపునిస్తుంది .

 

తాజాగా అమ్మడు ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేసింది. “ఈ మధ్యకాలంలో బాగా తింటున్న.. బాగా కొవ్వు కూడా వచ్చేస్తుంది.. కానీ అదంతా ఎక్కడికి పోతుంది ..ఇలా చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది..” అంటూ తన హార్డ్ వర్క్ అవుట్ చేసిన వీడియోను చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news