Moviesఆ జబ్బుతో బాధపడుతున్న సమంత.. హాస్పిటల్ బెడ్ పై.. కదల్లేని పొజీషన్...

ఆ జబ్బుతో బాధపడుతున్న సమంత.. హాస్పిటల్ బెడ్ పై.. కదల్లేని పొజీషన్ లో ఎమోషనల్ పోస్ట్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం బాగోలేదా అంటే అవుననే చెప్పాలి . గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత ఈ మధ్యనే తిరిగి యాక్టివ్ అయింది. ఈ క్రమంలోనే సమంత పాన్ ఇండియా రేంజ్ లో నటించిన యశోద సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కాగా రీసెంట్ గా సమంత తన ఆరోగ్యం పై ఓ పోస్ట్ పెట్టింది.

హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..బిగ్ బాంబ్ పేల్చింది. కొద్దిసేపటి క్రితమే సమంత తన అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలో తన హెల్త్ గురించి సంబంధించిన పోస్ట్ పెట్టికొచ్చింది. ఆ పోస్టులో సమంత ఏం రాసిందంటే..” నేను నటించిన యశోద సినిమా ట్రైలర్ కు మీ నుండి వస్తున్న రెస్పాన్స్ చాలా బాగుంది. నాపై చూపిస్తున్న ఈ ప్రేమ అభిమానులకు నేను కృతజ్ఞతురాలని . సినిమా కూడా మీకు నచ్చుతుంది.”.

” గత కొద్ది నెలలుగా తాను ఆటో ఇమ్యూన్ సమస్యతో బాధపడుతున్నాననీ, దానిని మయోసైటిస్‌గా పరిగణిస్తారనీ, ప్రస్తుతం వైద్య చికిత్స తీసుకుంటున్నాననీ, తొలుత అనుకున్నంత వేగంగా చికిత్స పూర్తయ్యేలా కనిపించడంలేదని సమంత చెప్పుకొచ్చింది.వైద్యులు తనకు మంచి వైద్య చికిత్సను అందిస్తున్నారనీ, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో అందరి ముందుకూ వస్తానని సమంత పేర్కొంది. నిజానికి ఈ వ్యాధి త్వరగా నయమైపోతుందని నేను మిమ్మల్ని త్వరలోనే మీట్ అవ్వాలని అనుకున్నాను.. కానీ నేను అనుకున్న సమయం కంటే ఎక్కువ ఆలస్యం అయ్యేలా ఉంది. ఈ జబ్బు తగ్గడానికి ఇంకా టైం పడుతుంది ..త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తానని అనుకుంటున్నాను ..థాంక్స్ ఫర్ యువర్ విషెస్ .. బ్లెస్సింగ్స్” అంటూ ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఒక్కసారి సమంత అభిమానులు బాధపడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news