Moviesఅబ్బబ్బా..పండగ చేసుకుంటున్న దిల్ రాజు.. ఎంత లక్కి ఫెలో అంటే..!

అబ్బబ్బా..పండగ చేసుకుంటున్న దిల్ రాజు.. ఎంత లక్కి ఫెలో అంటే..!

రీసెంట్గా ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..త్వరలోనే మరో ప్రతిష్టాత్మక సినిమాతో మనం ముందుకు రాబోతున్నాడు . కోలీవుడ్ సూపర్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్గా చేస్తుంది బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ. మరో హీరోయిన్గా చేస్తుంది టాలీవుడ్ ముద్దుగుమ్మ అంజలి .

భారీ తారగాణం తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు దిల్ రాజు. ప్రస్తుతం ఈ మూవీ సర వేగంగా షూటింగ్ జరుగుతుంది . కాగా దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది . మరి ముఖ్యంగా ఈ సినిమా కోసం ఫారిన్ కంట్రీస్ లో షూటింగ్ ప్లాన్ చేయకుండా ..కేవలం ఇండియాలోనే ప్లాన్ చేస్తూ నాచురాలిటీకి దగ్గరగా ఉండేలా డిజైన్ చేసుకున్నారట.

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ యూఎస్ఏ రైట్స్ 17 కోట్లకు అమ్మారని టాక్ వినిపిస్తుంది. దీంతో దిల్ రాజు గాల్లో తేలుతున్నాడని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ ఆఫర్ వస్తుందని ఎవరు ఊహించలేదట. ఆర్ఆర్ఆర్ సక్సెస్ అయ్యిన కారణంగానే ఇది సాధ్య పడింది అంటున్నారు . ఈ సినిమా నాన్ ధియేట్రికల్ రైట్స్ ప్రముఖ మీడియా సంస్థ జీ ఛానల్ దాదాపు 250 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది . అంతేకాకుండా ఈ సినిమాకు స్క్రీనింగ్ భాగస్వామిగా కూడా జీ ఫైవ్ ఒప్పందం కుదుర్చుకుందట. రిలీజ్ కు ముందే ఆర్సి15 సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. లక్ అంటే దిల్ రాజుదే ఈ మధ్యకాలంలో ఆయన తీసిన సినిమాలు అన్ని హ్యూజ్ సక్సెస్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news