Moviesస్నేహ నడుము గిల్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారి...అప్పట్లో సెన్సేషనల్...!

స్నేహ నడుము గిల్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారి…అప్పట్లో సెన్సేషనల్…!

చూడ్డానికి అచ్చ తెలుగ‌మ్మాయిల్లా క‌నిపించి ప్రేక్ష‌కుల‌ను అలరించిన హీరోయిన్ ల‌లో స్నేహా కూడా ఒక‌రు. తొలివ‌ల‌పు సినిమాతో స్నేహా టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మ‌య్యింది. ఆ త‌రువాత వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంది. స్నేహ అందానికి టాలీవుడ్ ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. గ్లామ‌ర్ షోకు దూరంగా ఉంటూ స్నేహా ఎక్కువ‌గా ప‌ద్దతిగా క‌నిపించే పాత్ర‌ల‌లోనే న‌టించి ఆక‌ట్టుకుంది. టాలీవుడ్ లోని స్టార్ హీరోల‌కు జోడీగా న‌టించి స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అందుకుంది. ఇక స్నేహ న‌టించిన సినిమాల్లో శ్రీరామ‌దాసు, ప్రియ‌మైన నీకు సినిమాలు మంచి విజ‌యం సాధించాయి.

స్నేహా తెలుగుతో పాటూ త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేసి ఆక‌ట్టుకుంది. ఇక స్నేహా న‌టుడు ప్ర‌స‌న్న కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి త‌ర‌వాత కూడా త‌న భ‌ర్త‌తో క‌లిసి సినిమాల్లో న‌టించింది. అంతే కాకుండా వీరిద్ద‌రూ ఎక్కువ‌గా టీవీ యాడ్స్ లో క‌లిసి న‌టిస్తూ ఉంటారు. ఇదిలా ఉండ‌గా స్నేహ గ‌తంలో ఓ వివాదం వ‌ల్ల వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధార‌ణంగా సినిమాల్లో బిజీ అయిన త‌వ‌రాత హీరోయిన్ లు వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల‌తో బిజీ అవుతుంటారు. అంతే కాకుండా షాప్ ఓపెనింగ్స్ లో సంద‌డి చేస్తుంటారు.

అక్క‌డ చాలా మంది జ‌నాల న‌డుమ ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చిన‌ప్ప‌టికీ డ‌బ్బుల కోసం చేయ‌క‌త‌ప్ప‌దు. ఇక స్నేహాకు ఓ షాప్ ఓపెనింగ్ స‌మ‌యంలో చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. కేర‌ళ‌లోని తిరుచ్చి ప‌ట్ట‌ణంలో స్నేహా ఓ షాప్ ఓపెనింగ్ కోసం వెళ్లింది. అక్క‌డ షాప్ లోకి వెళుతున్న స‌మ‌యంలో అక్క‌డే ఉన్న ఓ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి అమె న‌డుం గిల్లాడు. దాంతో స్నేహ గ‌ట్టిగా అరిచింద‌ట‌.

 

సెక్యురిటీకి జ‌రిగిన విష‌యం చెప్ప‌డంతో వాళ్లు వ్య‌క్తిని ప‌ట్టుకుని పోలీసులకు అప్ప‌గించారు. స్నేహ ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకుని నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేసింది. ఇక నిందితుడు ఓ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి కాగా అరెస్ట్ అయిన కొద్ది రోజుల త‌ర‌వాత బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అప్ప‌ట్లో ఈ వార్త‌లు మీడియాలో సెన్సేష‌న‌ల్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news