Moviesసురభిని అంతగా వాడుకున్నా ఆ కార‌ణంతోనే టాలీవుడ్‌లో ఛాన్సులు ఇవ్వ‌లేదా...!

సురభిని అంతగా వాడుకున్నా ఆ కార‌ణంతోనే టాలీవుడ్‌లో ఛాన్సులు ఇవ్వ‌లేదా…!

సురభి ..ఈ పేరు వింటే జెంటిల్ మేన్ లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. సురభి పురాణిక్ అనేది తన అసలు పేరు అయినప్పటికీ తెలుగుతో పాటు, తమిళ చిత్రాలలోనూ నటిస్తుంది. ముందుగా తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ భామ తెలుగులో సందీప్ కిష‌న్‌ బీరువా సినిమాతో అడుగుపెట్టింది. ఈ సినిమా అంత హిట్ కాకపోయినా కూడా సురభికి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తనకి బాగా క్రేజ్ తెచ్చిన సినిమా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్ మేన్.

నివేతా థామస్ హీరోయిన్‌గా నటించింది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ కమర్షియల్ హిట్ కావడంతో సురభికి వరుసగా అవకాశాలు వస్తాయని భావించారు. వచ్చాయి గానీ ఆ సినిమాలు జెంటిల్ మేన్ రేంజ్‌లో హిట్ అవలేదు. ఒక్క క్షణం, ఓటర్, శశి సినిమాలు వచ్చాయి. హిట్ టాక్ తప్ప పెద్దగా ఆశించిన సక్సెస్ సాధించలేదు. అందం ఉంది..అభినయం ఉంది. కానీ, సురభి ఎందుకు స్టార్ హీరోయిన్‌గా నిలబడలేకపోయింది.

దీనికి కారణం ఆమెకి పెద్దగా సపోర్ట్ చేసిన మేకర్స్ లేరనే టాక్ వినిపిస్తోంది. పెద్ద దర్శకులు, నిర్మాతలు సురభిని అంతగా పట్టించుకోలేదనేది ఇక్కడ చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. అలా సపోర్ట్ ఉంటే ఏ పూజా హెగ్డేనో, ఏ రష్మిక మందన్ననో అయి ఉండేది. పెద్ద దర్శకులు గనక పెద్ద హీరోల సరసన హీరోయిన్‌గా అవకాశం ఇచ్చి ఉంటే గ్యారెంటీగా సురభి రేంజ్ ఇప్పుడు ఇంకోలా ఉండేది.

దీనికి సురభి ఫేట్ కంటే కూడా సపోర్ట్ చేసేవారే లేక ఇలా తన కెరీర్ నల్లేరు మీద నత్త నడకలా సాగుతుంది. చెప్పాలంటే ఇప్పుడు ఇండస్ట్రీలో సురభి ఫేడవుట్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరింది. అయితే, అప్పుడప్పుడు కమర్షియల్ యాడ్ ఫిలింస్‌లో కనిపిస్తోంది. అందంలో కూడా అమ్మడు చాలా బాగా మేయింటైన్ చేస్తోంది. ముద్దు సన్నివేశాలకి, రొమాంటిక్ సీన్స్‌కి, బికినీ సూట్స్‌కి వెనకాడదు..కానీ, కావాల్సింది మేకర్స్ నుంచి సపోర్ట్. అది ఉంటే మంచి స్థాయికి ఖచ్చితంగా వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news