Moviesకొర‌టాల‌పై చిరు చేసిన కామెంట్ల‌కు అదిరే పంచ్ ఇచ్చిన తార‌క్‌...!

కొర‌టాల‌పై చిరు చేసిన కామెంట్ల‌కు అదిరే పంచ్ ఇచ్చిన తార‌క్‌…!

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో స‌క్సెస్ రేటు బాగా త‌క్కువుగా ఉంటుంది. జూన్‌లో ఒక్క మేజ‌ర్ మాత్ర‌మే ఆడింది. క‌మ‌ల్ డ‌బ్బింగ్ మూవీ విక్ర‌మ్ ఓకే. జూలై నెల అంతా చీదేసింది. ఆగ‌స్టులో బింబిసార‌, కార్తీకేయ 2,సీతారామం ఆశ‌లు నిలిపాయి. ఆగ‌స్టులో 19 సినిమాలు రిలీజ్ అయితే కేవ‌లం 3 మాత్ర‌మే హిట్ అయ్యాయి అంటే స‌క్సెస్ రేటు ఎంత త‌క్కువుగా ఉందో తెలుస్తోంది. ఇక ఈ యేడాది పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చీదేశాయి. చిరంజీవి – రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి చేసిన ఆచార్య కూడా డిజాస్ట‌ర్ అయ్యింది.

ఆచార్య డిజ‌ప్పాయింట్‌మెంట్ మెంట్ చేశాక చిరు ఎంచుకున్న ప్రాజెక్టులు ఆయ‌న ఫ్యాన్స్‌కే న‌చ్చ‌డం లేదు. ఏదేమైనా ఆచార్య చిరు ఇమేజ్‌కు పెద్ద డ్యామేజ్ చేసింది. ఈ క్ర‌మంలోనే చిరు ఇటీవ‌ల ఒక‌టి రెండు ఫంక్ష‌న్ల‌లో ఆచార్య ఫ‌లితంతో పాటు ఆ సినిమా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తోన్న ప‌రిస్థితి. రెండు రోజుల క్రితం ఓ ఈవెంట్లో కూడా మాట్లాడుతూ డైరెక్ట‌ర్ల‌కు కొన్ని స‌ల‌హాలు ఇచ్చారు.
డైరెక్ట‌ర్లు స‌రిగా ఉండ‌క‌పోతే ప్లాప్స్ వ‌స్తాయ‌ని… అందుకు త‌న సినిమానే ఉదాహ‌ర‌ణ అని చెప్పారు. చిరు అన్న‌ది అచార్య సినిమాను ఉద్దేశించే అని… అది కూడా కొర‌టాల‌నే ఆయ‌న ప‌రోక్షంగా టార్గెట్ చేశార‌న్న చ‌ర్చ కూడా న‌డిచింది.

డేట్లు క్లాష్ అవుతున్నాయ‌నో.. మ‌రొక‌టి అనో కంగారుగా షూటింగ్ చేయ‌వ‌ద్ద‌ని… మీ మీద ఇండ‌స్ట్రీయే ఆధార‌ప‌డి ఉంద‌న్న విష‌యం గుర్తుంచు కోవాల‌ని చిరు అన్నారు. చిరు ఈ వ్యాఖ్య‌లు చేసిన త‌ర్వాత ఆయ‌న కొర‌టాల శివ‌ను ఉద్దేశించే ఈ మాట‌లు అన్నార‌న్న గుస‌గుస‌లు ఇండస్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. అంతా కొర‌టాల‌దే త‌ప్పు అన్న‌ట్టుగా చిరు కామెంట్లు ఉన్నాయ‌న్న చ‌ర్చ బాగా న‌డుస్తోంది. ఈ టైంలో కొర‌టాల‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన జూనియ‌ర్ ఎన్టీఆర్ కొర‌టాల‌కు భుజం కాస్తూ చిరుకు కౌంట‌ర్ ఇచ్చార‌న్న కొత్త చ‌ర్చ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.

తాజాగా బ్ర‌హ్మాస్త్ర సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా ఒత్తిడికి లోన‌వుతోంది… ప్రేక్ష‌కులు ఏదో కొత్త‌గా కావాల‌ని కోరుకుంటున్నారు. ఆ ఒత్తిడిని త‌ట్టుకుని త‌న వ‌ర‌కు తాను బాగా న‌టించాల‌ని కోరుకుంటాన‌ని… ఈ ఒత్తిడిని ఇండ‌స్ట్రీ ఓ ఛాలెంజింగ్‌గా స్వీక‌రించాలి… అప్పుడే మంచి సినిమాలు వ‌స్తాయి.. ఇది అంద‌రూ అర్థం చేసుకుంటార‌ని అనుకుంటున్నాన‌ని తార‌క్ చెప్పాడు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. కొర‌టాల‌కు స‌పోర్ట్‌గానే ఎన్టీఆర్ ఇలా మాట్లాడాడు అని… ఇండ‌స్ట్రీయే ఒత్తిడిలో ఉంది… దీనికి ఏ ఒక్క‌రు కార‌ణం కాదు.. ఏ ఒక్క‌రిని నిందించాల‌నుకోవ‌డం క‌రెక్ట్ కాదు… ఇప్పుడు అంద‌రూ అప్‌డేట్ అవ్వాల‌ని చెప్ప‌డంతో చిరుకు ఎన్టీఆర్ పంచ్ ఇచ్చార‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. మ‌రి ఎన్టీఆర్ నిజంగానే చిరు వ్యాఖ్య‌ల‌కు ప‌రోక్షంగా మాట్లాడారా ? ఇది ఊహ మాత్ర‌మేనా ? అన్నది ఆయ‌న‌కే తెలియాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news