Moviesఒకప్పటి స్టార్ హీరోయిన్ రేవతిని ఆ డైరెక్టర్ వాడుకుని వదిసాడని తెలుసా...?...

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేవతిని ఆ డైరెక్టర్ వాడుకుని వదిసాడని తెలుసా…? అతడి వల్ల ఆస్తులు అన్నీ పోగొట్టుకుని…!

ఒకప్పటి సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో రేవతి కూడా ఒకరు. రేవతి మానసవీణ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అయితే అప్పటికే రేవతి మలయాళం లో అనేక చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. ఇక టాలీవుడ్ లోనూ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. రేవతి నటించిన అంకురం సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ఆమె కెరీర్ మలుపు తిరిగింది. రేవతి కేరళలోని కుర్చీలో జన్మించింది. ఆమె తల్లి ఓ ఆర్మీ ఆఫీసర్ కాగా…. చిన్ననాటి నుండి రేవతికి డాన్స్ పై ఇంట్రెస్ట్ తో భరతనాట్యం నేర్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలన్న కోరిక ఉండటంతో నాటకాల్లో న‌టించి ఆ త‌ర‌వాత‌ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రాణించిన‌ రేవతి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తల్లి, అత్త మరియు ఇతర పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రేవతి జీవితంలో ఓ వ్యక్తిని నమ్మి దారుణంగా మోసపోయింది. రేవతి దర్శకుడు సురేష్ చంద్ర మీనన్ ను 1986లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత రేవ‌తి సురేష్ కొంత‌కాలం బాగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత మాత్రం సురేష్ చంద్ర మీనన్ రేవతిని టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడట‌.

పెళ్లి త‌ర‌వాత‌ సురేష్ చంద్ర మీన‌న్ రేవ‌తి సంపాద‌న‌తో తానే హీరోగా ఓ సినిమా చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో దారుణంగా నష్టాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత మ‌ళ్లీ రేవతి సంపాదించ‌న డ‌బ్బుతోనే స్వీయ నిర్మాణంలో ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆర్థిక‌ కష్టాలు మొదలయ్యాయి. ఇక ఈ రెండు సినిమాల ద్వారా రేవతి సంపాదించిన డబ్బు అంతా వృధా అయ్యింద‌ట‌. అంతేకాకుండా సురేష్ చంద్ర మీన‌న్ కేవలం డబ్బు కోసమే రేవతిని వాడుకునేవార‌ట.

తన పట్ల భర్త చూపించే నిర్లక్ష్యం చూసి రేవతికి విసుగు వచ్చింది. ఈ నేపథ్యంలోనే పిల్లలను కనకూడదని రేవతి నిర్ణయం తీసుకున్నారట. చాలా కాలం పాటు రేవతిని సురేష్ చంద్ర మీన‌న్‌ వేధించినప్పటికీ 2002 వరకు మౌనంగా భరించారట. ఇక చివరికి ఆ ఏడాది అతనితో విడాకులు తీసుకుని ఒంటరి జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రేవతి ఓ అనాధ పాపను దత్తత తీసుకుని పెంచుకుంటున్నట్టు తెలుస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news