Moviesద‌గ్గుబాటి అభిరాంను ఆ కాంట్ర‌వ‌ర్సీ బ్యూటీ మ‌ళ్లీ టార్గెట్ చేస్తోందా... ...

ద‌గ్గుబాటి అభిరాంను ఆ కాంట్ర‌వ‌ర్సీ బ్యూటీ మ‌ళ్లీ టార్గెట్ చేస్తోందా… ‘ అహింస‌ ‘ సినిమాపై నెగ‌టివ్ ర‌చ్చ‌… !

టాలీవుడ్ లో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఇప్పటికే సురేష్ బాబు తనయుడు రానా హీరోగా ఎంట్రీ ఇచ్చే సక్సెస్ అయ్యాడు. బాహుబలి సిరీస్ సినిమాలతో రానా నేషనల్ వైడ్‌గా సూపర్ పాపులర్ అయిపోయాడు. రానా కెరీర్ కు పటిష్టమైన పునాది పడిపోవడంతో తిరుగులేదు. ఇక ఇప్పుడు ఇదే దగ్గుబాటి వంశం నుంచి రాణా తమ్ముడు దగ్గుబాటి అభిరాం కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అహింస సినిమాలో అభిరామ్ హీరోగా నటిస్తున్నాడు.

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ – సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన అహింస ఫ్రీ లుక్ పోస్టర్‌తో అందరిలోనూ మంచి హైప్‌ వచ్చేసింది. ఇక ఈ సినిమా వాయిస్ పోస్టర్ కూడా అదిరిపోయింది. శ్రీకృష్ణుని తత్వాన్ని పాటించే హీరోయిన్ వాయిస్ తో విభిన్నంగా రిలీజ్ అయిన వాయిస్ పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అహింస సినిమాలో అభిరామ్ రఘు అనే కుర్రాడి పాత్ర చేస్తుండగా.. హీరోయిన్ గీతిక అహల్య పాత్రలో కనిపిస్తోంది.

అయితే అభిరామ్ తొలి సినిమాకు టాలీవుడ్ లో కొన్ని వర్గాల నుంచి భారీ ఎత్తున నెగెటివిటీ ప్రచారం చేసేలా ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అభిరామ్‌ను కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ శ్రీరెడ్డి ఎప్ప‌టి నుంచో టార్గెట్ చేస్తూ వ‌స్తోంది. క‌రోనాకు ముందే శ్రీరెడ్డి.. అభిరామ్ త‌న‌ను అవ‌కాశాల పేరుతో లైంగీకంగా వాడుకున్నాడ‌ని.. త‌న‌పై చాలాసార్లు అత్యాచారం చేశాడ‌ని… త‌నను చాలా మ‌భ్య‌పెట్టి మోసం చేశాడ‌ని ప‌లు ఆరోప‌ణ‌లు కూడా చేసింది.

పైగా వాళ్ల స్టూడియోలోనే త‌న‌పై చాలాసార్లు అత్యాచారం చేశాడ‌ని కూడా ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇండ‌స్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. ఆ త‌ర్వాత శ్రీరెడ్డి వెంక‌టేష్‌, సురేష్‌బాబును కూడా త‌న మామ‌లు అంటూ ఘాటు సెటైర్లు వేస్తూ వ‌స్తోంది. వీలున్న‌ప్పుడల్లా అభిరామ్‌ను కూడా టార్గెట్ చేసింది. ఇక రేపు అభిరామ్ ఫ‌స్ట్ సినిమా రిలీజ్‌కు ముందు నుంచే శ్రీరెడ్డి సోష‌ల్ మీడియాలో సినిమాతో పాటు మ‌నోడిని ర‌క‌ర‌కాలుగా టార్గెట్ చేసేందుకు రెడీగా ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news