Moviesఆ టాలీవుడ్ హీరో కెరీర్ క్లోజ్ అయిపోయిందా... చేజేతులా నాశ‌నం చేసుకున్నాడా...!

ఆ టాలీవుడ్ హీరో కెరీర్ క్లోజ్ అయిపోయిందా… చేజేతులా నాశ‌నం చేసుకున్నాడా…!

టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా నిర్మాతలు దర్శక హీరోగా పేరు తెచ్చుకున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన రవితేజ మధ్యలో స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇచ్చాడు. తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి రవితేజ గత కొన్నేళ్ల‌లో వరుస ప్లాపుల‌తో డీలా పడిపోయాడు. అసలు రవితేజ మార్కెట్ కూడా పూర్తిగా డల్ అయిపోయింది. దీంతో పాటు అతడి ఫేస్ లో చరిష్మా కూడా తగ్గిపోయింది ముఖమంతా ముడతలు పడి ముసలితనం కొట్టిచ్చినట్టు కనపడుతుంది.

మలినేని గోపీచంద్ క్రాక్ సినిమా లేకపోయి ఉంటే ఇప్పటికే రవితేజ కెరీర్ క్లోజ్ అయిపోయి ఉండేది. అయితే క్రాక్ సినిమా హిట్ అవడంతో రవితేజపై నమ్మకం ఉంచిన ఎంతోమంది నిర్మాతలు అతనికి వరుస‌గా అడ్వాన్సులు ఇచ్చారు. క్రాక్ ముందు రవితేజకు వరుసగా ప్లాప్‌లు పడ్డాయి. మ‌నోడి మార్కెట్ కూడా పూర్తిగా డల్ అయిపోయింది. అసలు రవితేజతో సినిమా తీసేందుకు ఏ నిర్మాత కూడా ఇష్టపడని దుస్థితి ఎదురయింది. ఎప్పుడైతే క్రాక్ సినిమా కరోనా సమయంలో కూడా సూపర్ హిట్ అవడంతో పాటు భారీ వసూళ్లు సాధించిందో.. వెంటనే చాలామంది నిర్మాతలు రవితేజను కలిసి అడ్వాన్సులు ఇచ్చేశారు.

దీంతో రవితేజ కూడా దొరికిన కాడికి దొరికినంత అడ్వాన్సులు తీసేసుకున్నాడు అన్న ప్రచారం ఇండస్ట్రీలో ఉంది. ఈ యేడాది రవితేజ నటించిన ఖిలాడి – రామారావు ఆన్‌ డ్యూటీ రెండు సినిమాలు బిగ్గెస్ట్ ప్లాప్‌ అవడంతో పాటు నిర్మాతలు.. ఈ సినిమాలు కొన్న బయ్యర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం రవితేజ నటించిన ధమాకా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు రావణాసుర… మరో మూడు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా క్రాక్ తర్వాత రవితేజ తీసుకున్న అడ్వాన్సులకు బదులుగా చేస్తున్న సినిమాలు.

రవితేజ ఇప్పటికైనా కథాకథనాలపై దృష్టి పెట్టకుండా చేతికి వచ్చిన అడ్వాన్సులను బట్టి సినిమాలు చేస్తే మరో ఏడాదిలోనే రవితేజ కెరీర్ క్లోజ్ అయిపోతుందన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్నాయి.
రవితేజ అసలు కథనాలపై దృష్టి పెట్టడం లేదని ఎడాపెడా ఎవరు ? అడ్వాన్స్ ఇస్తే వాళ్లకు సినిమాలు ఓకే చేసేస్తున్నాడని అంటున్నారు. దీనికి తోడు ఇప్పటికే ఏజ్ బార్ అయిపోయినా రవితేజ కుర్ర భామ‌లను హీరోయిన్లుగా సెట్ చేసుకుంటున్నాడు. యంగ్‌గా కనిపించడానికి ఎంత కష్టపడుతున్నా సినిమా తెరమీద ఫేస్ మీద ముడతలు స్పష్టంగా కనబడుతున్నాయి.

ఇప్పటి నుంచైనా రవితేజ మరి కొంతకాలం ఇండస్ట్రీలో ఉండాలంటే తన వయసుకు తగిన పాత్రలు చేయడంతో పాటు… తన పక్కన సెట్ అయ్యే అమ్మాయిలను హీరోయిన్లుగా పెట్టుకోవాలని పలువురు చెబుతున్నారు. లేకపోతే రవితేజ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు అయ్యే టైంకే అతడి కెరీర్‌ క్లోజ్ అయిపోతుందని ఇండస్ట్రీలో సీరియస్‌గా చర్చ నడుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news