Moviesబరి తెగించిన బిగ్ బాస్ హౌస్ ..రేవంత్ నోటి వెంట పచ్చిబూతు...

బరి తెగించిన బిగ్ బాస్ హౌస్ ..రేవంత్ నోటి వెంట పచ్చిబూతు పదం..హవ్వ..ఛీ ఛీ..!!

హమ్మయ్య.. ఎట్టకేలకు ..హోస్ట్ నాగార్జున అనుకున్నది సక్సెస్ ఫుల్ గా సాధించాడు. మొన్న వచ్చిన వీకెండ్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్లో ఫైర్ లేదు.. తొక్క లేదు.. తిన కూర్చుంటున్నారా ..మీరు ఆట ఆడటానికి హౌస్ లోకి వచ్చారా ..తినడానికి వచ్చారా..అంటూ నానా హంగామా సృష్టించాడు. ఆ మాటలను బాగా పట్టించుకున్నట్లున్నారు కంటెస్టెంట్లు. అందుకే ఎవ్వడికి తోచిన విధంగా వాళ్ళు హౌస్ లో ఆస్కార్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు .

రీసెంట్ గా అడవిలో ఆట అనే టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య పెద్ద వార్ జరిగింది. రీసెంట్ టాస్క్ లో హౌస్ లోని కంటెస్టెంట్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ క్రమంలోని హౌస్ లో అడవిలో ఆట గేమ్ ఆడుతున్న టైంలో ఆరోహి కి గాయమైంది.

దీంతో వెంటనే ఆమెను హౌస్ లోకి తీసుకెళ్లిపోయారు . ఈ క్రమంలోనే ఇనయా సింపతి గేమ్ అంటూ టంగ్ స్లిప్ అయింది. దీంతో మేటర్ లోకి ఎంటర్ అయిన సత్య శ్రీ నిజంగానే ఆమెకు గాయమైంది అంటూ చెప్పుకొచ్చింది . అప్పుడు కూడా కంట్రోల్ అవ్వకుండా “లాగింది వాడేగా” అంటూ శ్రీహన్ వైపు చూపించింది . ..”వాడు ఏంటే వాడు” అంటూ సీరియస్ అయ్యాడు శ్రీహాన్. మధ్యలోకి దూరిన రేవంత్ ” నన్ను కూడా అలాగే వాడు అంది ..అప్పుడు లాగి కోయాల్సిందంటూ పచ్చి బూతు పదం వాడాడు”. దీంతో హౌస్ లో ఫుల్ ర్చ్చ రచ్చ అయిపోయింది. దీంతో నాగార్జున గారు చెప్పినట్లే హౌస్ లో ఫుల్ గొడవలతో సందడి మొదలైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news