Moviesశృంగార తార ష‌కీలాను దారుణంగా మోసం చేసింది ఎవ‌రు... ఇన్ని క‌ష్టాలు...

శృంగార తార ష‌కీలాను దారుణంగా మోసం చేసింది ఎవ‌రు… ఇన్ని క‌ష్టాలు అనుభ‌వించిందా…!

సౌత్ లో శృంగార తారగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి షకీలా. షకీలా వందల సినిమాల్లో నటించి అలరించింది. కెరీర్ ప్రారంభంలో షకీలా సాధారణమైన పాత్రల్లోనే నటించింది. కానీ కొంతకాలం తర్వాత సినిమాల్లో వ్యాంప్ పాత్రలు చేసింది. షకీలా లీడ్ రోల్ లో కొన్ని మలయాళ చిత్రాల్లో నటించింది. నిజానికి షకీలా జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆమె జీవితంలో ఎన్నో ఆటు పొట్లు ఉన్నాయి అన్నసంగతి చాలా మందికి తెలియదు.

సొంత వాళ్ళే తనను దారుణంగా మోసం చేశారని షకీలా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తను సినిమాల్లో కష్టపడి సంపాదించిన 2 కోట్ల రూపాయల డబ్బును తన సోదరికి ఇచ్చినట్టు తెలిపింది. అయితే ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే తాను వేరే వ్యక్తిని న‌మ్మి అత‌డికి ఇచ్చి మోసపోయాను అని త‌న సోద‌రి చెప్ప‌డంతో తాను మోస‌పోయాన‌ని ష‌కీలా చెప్పింది.

అయితే తనను మోసం చేసిన తరవాత కూడా సోదరితో మాట్లాడతానని చెప్పింది. కానీ తన సోదరి రెండు కోట్లు మోసం చేసి మాట్లాడటం కూడా మానేసింది అని ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా తన కుటుంబ సభ్యులు కూడా తనతో మాట్లాడటం మానేసినటట్టు పేర్కొంది. బయట వ్యక్తులు మోసం చేస్తే వాళ్ల పై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం …. కానీ సొంతవాళ్లే మోసం చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

అలా కావాల్సిన వాళ్ల దగ్గరే చాలా డబ్బులను మోసపోయాను అని ష‌కీలా వాపోయింది. ఇక షకీలా ప్రస్తుతం ఒంటరిగా హైదరాబాద్ లో ఉంటుంది. అంతే కాకుండా ఓ ట్రాన్స్ జెండర్ తో కలిసి షకీలా ఉంటోంది. ఆ ట్రాన్స్ జెండర్ తన కుమార్తె అని చెప్పింది. ఇక సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ లో స్క్రీన్ పై పెద్దగా కనిపించడం లేదు. చాలా కాలం క్రితం కొబ్బరి మట్ట సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఆ త‌ర్వాత ఆమెకు పెద్ద‌గా అవ‌కాశాలు అయితే రావ‌డం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news