Moviesప్రగతి ఆంటీ హీరోయిన్‌గా చేసిన సినిమా ఏదో తెలుసా...!

ప్రగతి ఆంటీ హీరోయిన్‌గా చేసిన సినిమా ఏదో తెలుసా…!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అంటే టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. చాలా సినిమాలలో తల్లిగా అత్తగా నటించిన ప్రగతి ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యింది. కేవలం ఎమోషనల్ పాత్రల్లోనే కాకుండా కామెడీ చేయడంలో కూడా మంచి నటి అని నిరూపించుకుంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్ షా సినిమాల్లో ఓ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టింది. అంతే రాజా ది గ్రేట్ సినిమాలో కూడా ఓ పాటకు డ్యాన్స్ చేసింది. ప్రగతి సోషల్ మీడియాలో ఫిట్ నెస్ వీడియోలు షేర్ చేస్తూ కుర్ర హీరోయిన్ లకు సైతం షాక్ ఇస్తోంది.

ఈ వ‌య‌స్సులోనూ ఆమె అంద చందాలు చూపిస్తూ చేసే వ‌ర్క‌వుట్ల‌కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ప్ర‌గ‌తి చెమటలు పట్టేలా వ్యాయామం చేసి ఆ వీడియోలను షేర్ చేయడమే కాకుండా పాటలు హాట్ హాట్ గా డ్యాన్స్ చేస్తూ వాటిని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. దాంతో ప్రగతికి సోషల్ మీడియాలో అభిమానులు ఎక్కువగా ఉంటారు. అంతే కాకుండా ప్రగతి ఆంటీ అని పిచుకుంటారు. అయితే ప్రగతి మాత్రం విమర్శలను పక్కన పెట్టేసి తనకు నచ్చినట్టు జీవిస్తున్నారు.

ఇటీవల జబర్దస్త్ టివి షో లో కూడా సందడి చేశారు. మరో వైపు పలు టీవి షోలలో కూడా సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీ కి వచ్చే చాలా మంది హీరో హీరోయిన్ అవ్వాలనే కోరిక తోనే వస్తుంటారు. ప్రగతి కూడా ఒక్కప్పుడు హీరోయిన్ గా నటించింది అన్న సంగతి చాలా మందికి తెలియదు. ప్రగతి ఏపిలోని ఒంగోలు జిల్లాలో జన్మించింది. సినిమాలు అంటే ఇష్టం తో చ్చివయసులో నే మోడలింగ్ చేసింది. అంతే కాకుండా ప్రగతి ఒక్కప్పుడు హీరోయిన్ గా కూడా సినిమాలో నటించింది. తమిళ దర్శకుడు మరియు హీరో భారతి రాజా సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది.

అంతే కాకుండా వీట్ల విదేశాంగ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తరవాత అనేక చిత్రాలు చేసింది. హీరోయిన్ గా అనుకున్నమేర సక్సెస్ అవ్వలేకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం ప్రగతి ఫుల్ బిజీగా ఉంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా ఎఫ్ 2,ఎఫ్ 3 సినిమా లతో ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్,వరుణ్ లకు అత్తగా నటించి ఆకట్టుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news