Moviesయస్..ఆ డైరెక్టర్ ని కాళ్లతో తన్నాను..పోసాని సంచలన కామెంట్స్..!!

యస్..ఆ డైరెక్టర్ ని కాళ్లతో తన్నాను..పోసాని సంచలన కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎంత మంచి జరుగుతుందో తెలియదు కానీ.. చెడు మాత్రం సంపూర్ణంగా జరుగుతుంది. ఎప్పుడో కనుమరుగైన పాత జ్ఞాపకాలను బయటకు తెప్పిస్తున్న సోషల్ మీడియా.. ఎప్పుడో జరిగిన రచ్చలను గొడవలను కూడా బయటకు తవ్వుతుంది . ఈ క్రమంలోనే పోసాని కృష్ణ మురళి గతంలో చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు పోసాని లో ఈ యాంగిల్ కూడా ఉందా..? అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. ఇంతకీ పోసాని కృష్ణమురళి ఏం చేశాడో తెలుసా..?

నటనపై ఉండే ఇంట్రెస్ట్ తో ఎంఏ చదివిన కృష్ణ మురళి.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ కమెడియన్ గా.. విలన్ గా ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. పలు రోల్స్ లో నటించి మెప్పించాడు. అంతేకాదు ఇండస్ట్రీలో ఈయనకు మెంటల్ అంటూ పుకారు కూడా పుట్టించారు. కానీ అవి ఏవి పట్టించుకోని పోసాని కృష్ణమురళి తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూనే ఉన్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

ఓ సినిమా టైంలో ఆయన ఓ డైరెక్టర్ ను కాళ్లతో తన్నాడని ఆయన స్వయంగా చెప్పుకొచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినట్టు తెలుస్తుంది. “ఓ సినిమా టైంలో పోసాని కృష్ణమురళిని ఆ సినిమాకు కో డైరెక్టర్ పని చేస్తున్న ఆయన ప్యాడ్ పేపర్స్ తీసుకొని రమ్మన్నారట . అయితే అవి అక్కడ దొరకకపోవడంతో అవి లేవు అని చెప్పే క్రమంలో ఆయన్ని పేరు పెట్టి పిలిచాడట కృష్ణ మురళి . దీంతో ఆయనకు కోపం వచ్చి.. సార్ అనలేవా అంటూ మండిపడ్డారట.

అందరి ముందే నోరు పారేసుకున్నారట. ఇక కొద్దిసేపు అయిన తర్వాత పొరపాటున అ కోడైరెక్టర్ ఏదో పిలవడానికి పోసాని పేరు పెట్టి పిలిచాడట. దీంతో వెంటనే మండిపోయిన పోసానికి కాళ్లతో తన్ని.. ఎందుకు మురళి అని పిలిచావు మురళి గారు అని ఎందుకు పిలవలేదని ఘాటుగా కౌంటర్ వేసాడట . నా మేనరిజం స్ట్రగుల్ అలా ఉంటాయంటూ ఆయన చెప్పుకొచ్చాడు” కాగా ప్రెసెంట్ పోసాని కృష్ణమురళి తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ జనాలను మెప్పిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news