Moviesన‌య‌న‌తారతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు శింబు ఏం చేశాడో తెలుసా...!

న‌య‌న‌తారతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు శింబు ఏం చేశాడో తెలుసా…!

కోలీవుడ్ క్రేజీ హీరో శింబు, లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార ప్రేమ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో కోలీవుడ్‌లో మాత్ర‌మే కాదు.. టోట‌ల్ సౌత్ ఇండియాలో ఓ సంచ‌ల‌నం. న‌య‌న‌తార అప్పుడ‌ప్పుడే స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోంది. ఆమెకు వ‌రుస‌గా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వ‌స్తున్నాయి. తెలుగులో, అటు త‌మిళంలో ర‌జ‌నీకాంత్‌, వెంక‌టేష్‌, ఎన్టీఆర్‌, ప్ర‌భాస్ లాంటి హీరోల ప‌క్క‌న చేస్తోంది. కోలీవుడ్‌లోనూ స్టార్లు ఆమె టాలెంట్‌కు ఫిదా అయిపోయి మంచి ఛాన్సులు ఇస్తున్నారు. క‌రెక్టుగా ఆ టైంలో కుర్ర హీరోగా మంచి యాట్యిట్యూడ్‌తో దూసుకుపోతోన్న శింబుకు ప‌డిపోయింది.

శింబు అయితే న‌య‌న్‌ను పిచ్చ పిచ్చ‌గా ప్రేమించేశాడు. అస‌లు ఆమెను విడిచి ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌లేని స్థితికి వ‌చ్చేశాడు. క‌ట్ చేస్తే ఆమె సినిమా షూటింగ్ ఎక్క‌డ జ‌రుగుతుంటే అక్క‌డే వాలిపోయేవాడు. చివ‌ర‌కు ఎవ‌రైనా స్టార్ హీరో సినిమా కోసం న‌య‌న్ విదేశాల్లో ఉంటే ఫ్లైట్ ఎక్కేసి అక్క‌డ ఆమె ముందే వాలిపోయేవాడు. అంత‌లా పిచ్చెక్కిపోయేవాడు. న‌య‌న్ కూడా శింబును అంతే ప్రేమించింది.

చివ‌ర‌కు అంత‌లా ఆమె ముందు ఉంటున్నా కూడా.. ఆమెతో క‌లిసి స‌హ‌జీవ‌నం చేస్తున్నా కూడా న‌య‌న్‌ను విడిచి ఉండ‌లేక‌పోయేవాడు. చివ‌ర‌కు ఆ టైంలో న‌య‌న్‌ను హీరోయిన్‌గా పెట్టి తానే సినిమా తీశాడు. ఆ సినిమా పేరే వ‌ల్ల‌భ‌. ఆ సినిమాకు మ‌రో ట్విస్ట్ ఏంటంటే శింబు హీరో, డైరెక్ట‌ర్‌. మ‌రో డైరెక్ట‌ర్ అయితే త‌న‌కు, న‌య‌న్‌కు మ‌ధ్య రొమాన్స్‌, ప్రేమ విష‌యంలో ఎక్క‌డ ఇబ్బంది వ‌స్తుందో ? అని తానే డైరెక్ట‌ర్ అయిపోయాడు.

కేవ‌లం న‌య‌న్ ప్రేమ‌, ఆమెను ఒక్క క్ష‌ణం కూడా విడిచి ఉండ‌లేక‌పోవ‌డంతోనే శింబు ఈ సినిమా తీశాడ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అది నిజం కూడా…! చివ‌ర‌కు ఈ వ‌ల్ల‌భ సినిమాను శింబు ఏకంగా రెండేళ్ల పాటు తీశాడు. ఆ సినిమా టైంలో వారిద్ద‌రు ఎంతో ఘాడ‌మైన ప్రేమ ప‌క్షుల్లా ఉన్నారు. అయితే న‌య‌న‌తార‌కేం కాలేదు. ఆమె వ‌ల్ల‌భ‌తో పాటు మిగిలిన సినిమాలు చేసుకుని స్టార్ డ‌మ్ తెచ్చుకుంది.

అయితే శింబు మాత్రం ఆమె ప్రేమ మైకంలో ప‌డి అప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతోన్న వేళ త‌న కెరీర్‌ను నాశ‌నం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత మ‌రో ప‌దేళ్ల‌కు కాని శింబుకు హిట్ రాలేదు. తాను ఎంతో ప్రేమించిన న‌య‌న్ త‌న‌కు దూరం కావ‌డంతో ఒకానొక ద‌శ‌లో పిచ్చోడు అయిపోయాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ హ‌న్సిక‌తోనూ ప్రేమ ఫెయిల్ అయ్యింది. చివ‌ర‌కు ఇప్పుడు మ‌ళ్లీ రీ ఎంట్రీలో వ‌రుస హిట్లు ప‌డుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news