Moviesహిట్ కోసం కృతి తప్పుడు నిర్ణయాలు..వార్న్ చేస్తున్న స్టార్ హీరో ఫ్రెండ్..!?

హిట్ కోసం కృతి తప్పుడు నిర్ణయాలు..వార్న్ చేస్తున్న స్టార్ హీరో ఫ్రెండ్..!?

కన్నడ బ్యూటీ కృతి శెట్టి చేసింది ఐదు సినిమాలే కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఓ రేంజ్ లో ఉంది. దాదాపు 20, 30 సినిమాలు చేసిన హీరోయిన్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో.. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కృతి శెట్టి. అఫ్కోర్స్ ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం ఆమెకు ఉప్పెన సినిమా రిలీజ్ కాకముందే దక్కింది. అది ఎలా అంటారా? ఉప్పెన సినిమా కరోనా టైంలో వాయిదా పడింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన పాటలు మాత్రం ముందుగానే రిలీజ్ చేశారు మేకర్స్ . ఆ టైంలో కృతి శెట్టి బాగా పాపులర్ అయింది. మరి ముఖ్యంగా “నీ కళ్ళు నీలి సముద్రం” అనే సాంగ్ కి కృతిని తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయారు.

సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్ని పాటల్లోను అదరగొట్టేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన నాని శ్యామ్ సింగరాయ్. నాగచైతన్య బంగార్రాజు.. సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎక్స్ప్రెషన్స్ తో చంపేసింది అంటూ బిగ్ స్టార్స్ కూడా ఆమెను స్టేజి పైన పొగడేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రజెంట్ కృతిశెట్టి టైం బాగోలేదని చెప్పాలి . రామ్ తో నటించిన “ది వారియర్”.. యంగ్ హీరో నితిన్ తో నటించిన మాచర్ల నియోజకవర్గం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అలా ఇలా కాదు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి . పైగా ఈ సినిమాలో కృతి నటన టూ వర్స్ట్ అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి .

ఈ క్రమంలోనే కృతి ఎలాగైనా సరే తన నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలి అని చెప్పి గట్టిగా భీష్మించుకుని కూర్చుందట. అయితే కృతి త్వరలోనే “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా ద్వారా జనాలు ముందుకు రానుంది . ఇక ఈ సినిమా కాకుండా కృతిశెట్టి కోలీవుడ్లో సూర్యసరసన ఓ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసం కృతి బోల్డ్ డెసిషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తనకంటే డబుల్ ఏజ్ పెద్దవాడైనా సూర్యతో అమ్మడు లిప్ లాక్ సిద్దపడిందట . ఈ విషయం తెలుసుకున్న కృతి ఫ్రెండ్ అయిన స్టార్ హీరో అంత పెద్ద హీరోతో అలా చేస్తే నీకు అవకాశాలు తగ్గిపోతాయి.. బి కేర్ ఫుల్ అంటూ వార్న్ చేశారట. ప్రస్తుతం ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. మరి చూడాలి కృతి తీసుకున్న నిర్ణయం ఆమె కెరియర్ కు ప్లస్ అవుతుందో..లేదో,,?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news