Moviesబన్నీతో ఆ హీరోయిన్ డ్యాన్స్ చేస్తే...మంచంలో ఉన్న ముసలోడు కూడా ఊగిపోవాల్సిందే..!?

బన్నీతో ఆ హీరోయిన్ డ్యాన్స్ చేస్తే…మంచంలో ఉన్న ముసలోడు కూడా ఊగిపోవాల్సిందే..!?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో బన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి టాలీవుడ్ లోనే కాదు ..బాలీవుడ్, కోలీవుడ్ అన్ని భాషల్లోనూ బన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతగా తన డ్యాన్స్ తో మాయ చేసేస్తాడు ఈ అల్లు వారి అబ్బాయి. పుష్ప 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఆ తర్వాత కూడా నటించే సినిమాలు అన్ని పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండాలి అంటూ పక్క ప్లాన్ తో ముందుకెళ్తున్నాడు. కాగా గత ఏడాది డిసెంబర్ 17 పుష్ప ది రైజ్ అంటూ మన ముందుకు వచ్చిన ఈ స్టైలిష్ స్టార్ త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు . పుష్ప 1 ఎంత బ్లాక్ బస్టర్ హీట్ అయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 పై అంతకంటే డబుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోని ఉన్నారు అభిమానులు. దానికి కారణం సుకుమార్ బన్నీ కాంబో నే..


మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాల్లో పుష్ప 1 లో నటించిన నటీమణులు ఉంటూనే పుష్ప2లో కొత్త నటులను తీసుకునేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి పనులను ఫినిష్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పుష్ప2లో ప్రియమణి, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ .స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కూడా నటించబోతున్నారని తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి బన్నీతో కలిసి మాస్ స్టెప్స్ ఇరగదీస్తుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గిరిజన ప్రాంతం అమ్మాయిగా ఈ సినిమాలో బన్నీతో సాయి పల్లవి రొమాన్స్ చేయడానికి సిద్ధపడిందట. అంతేకాదు పుష్ప వన్ లో “ఊ ఉంటావా మామ” సాంగ్ ఎంత హిట్ అయ్యిందో.. పుష్ప 2 లో సాయి పల్లవి బన్నీ సాంగ్ హైలైట్ గా మారుతుంది అంటూ తెలుస్తుంది. బన్నీ ఇదివరకే ఫిదా మూవీ టైంలో సాయి పల్లవి తో కలిసి నటించాలి అని, ఆమెతో డ్యాన్స్ చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. ఇలాంటి టైంలో బన్నీ సాయి పల్లవి మధ్య డ్యాన్స్ ఎలా ఉండబోతుందో అంటూ అభిమానులు ఊహించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ బన్నీ సాయి పల్లవి డాన్స్ చూస్తే మంచంలో ఉన్న ముసలివాడు అయినా సరే కర్ర పట్టుకొని ఊగిపోవాల్సిందే అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news