Moviesతూ..అది బిగ్ బాస్ హౌసా..? కాదు బ్రో* హౌసే..! ఏంటి ఈ...

తూ..అది బిగ్ బాస్ హౌసా..? కాదు బ్రో* హౌసే..! ఏంటి ఈ పనులు నాగార్జున గారు..?

బిగ్ బాస్.. ఈ పేరు చెప్తే సంతోష పడే వాళ్ళు కొందరైతే మండిపడేవారు మరికొందరు. కొందరి జీవితాల్లో వెలుగునిచ్చిన ఈ బిగ్ బాస్ మరికొందరి జీవితాలకు శాపంలా మారింది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి కోటి ఆశలు పెట్టుకొని వెళ్లిన కంటెస్టెంట్ల జీవితాల్ని సర్వనాశనం చేసిందని చెప్పాలి . అందులో మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్. లాస్ట్ సీజన్లో ఈయన పాల్గొని తన కెరియర్ ని ఎలా మలుపు తిప్పుకున్నాడో మనం చూసాం . బంగారం లాంటి లైఫ్ ని సర్వనాశనం చేసుకున్నాడని అభిమానులు కూడా చెప్పుకొచ్చారు . అంతలా బిగ్ బాస్ ఈయన జీవితాన్ని మార్చేసింది.

 

కాగా రీసెంట్ గా బిగ్ బాస్ 6 ప్రారంభమైన సంగతి తెలిసిందే. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లను జనాలకు పరిచయం చేశాడు. ఆ తర్వాత హౌస్ కి తాళం వేసి తన హౌస్ కి తాను వెళ్ళిపోయాడు . ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. ఒకటి హౌస్ లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్ ఎవరూ లేకపోవడం ..రెండవది బిగ్ బాస్ హౌస్ లో బూతు పురాణం నడిపించడం. యస్ అందరూ ఇప్పుడు ఇదే అనుకుంటున్నారు. ఒక్కొక్క అమ్మాయి చడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగుతూ సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సిపిఐ నారాయణ మరోసారి బిగ్ బాస్ పై తన కోపాన్ని వెళ్ళకక్కారు.


ఆయన మాట్లాడుతూ..” బిగ్ బాస్ షో ఓ పనికిమాలిన షో.. అందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ కోతులని అది చూస్తున్న జనాల కూడా అలాగే “అంటూ దారుణమైన కామెంట్స్ చేశారు . అంతే కాదు ..”అది బిగ్ బాస్ హౌస్ కాదు అది బ్రోతల్ హౌస్ “అంటూ ఘాటుగా కామెంట్ చేశారు . దీంతో ఇప్పుడు బిగ్ బాస్ షోపై ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి . అంతేకాదు కొందర ఆయన మాటలను నిజమే అంటున్నారు “బిగ్ బాస్ ద్వారా ఎవరి లైఫ్ బాగుపడింది.. ఎవరికి ఏం ఉపయోగం..?” అంటూ మండిపడుతున్నారు . మరి చూడాలి బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఈయన మాటలపై ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news