Moviesవెంక‌టేష్ బ్లాక్ బస్ట‌ర్ చంటి సినిమాను... మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో...

వెంక‌టేష్ బ్లాక్ బస్ట‌ర్ చంటి సినిమాను… మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..!

టాలీవుడ్ లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. వెంకటేష్ కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలలో నటించారు 1990 ద‌శ‌కం నుంచి వెంకటేష్ కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. వెంకటేష్ సినిమాలు వస్తున్నాయంటే ఖ‌చ్చితంగా ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు.

అలా వెంకటేష్ ఫ్యామిలీ ఆడియోస్ కు బాగా కనెక్ట్ చేసిన సినిమా చంటి క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాకు రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. వెంకటేష్ కు జోడిగా మేన నటించింది. తమిళంలో పీ.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి.ఈ సినిమా తమిళ వెర్షన్ను నిర్మాత రామానాయుడు సురేష్ బాబు-కె ఎస్ రామారావు తో పాటు మరికొంతమంది కలిసి చూశారు వెంటనే కె ఎస్‌ రామారావు తెలుగు రైట్స్ కొన్నారు ఆయన రాజేంద్రప్రసాద్ హీరోగా ఈ సినిమాను రీమిక్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సురేష్ బాబు కేఎస్ రామారావు కు ఫోన్ చేసి మీకు అభ్యంతరం లేకపోతే ఆ సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తారని చెప్పారట.

దీంతో రాజేంద్రప్రసాద్ కు బదులుగా వెంకటేష్ హీరోగా ఈ సినిమాను కె ఎస్‌ రామారావు నిర్మించారు. అప్పటికే ఆయన వెంకటేష్ తో స్వర్ణకమలం లాంటి సూపర్ హిట్ సినిమా నిర్మించి ఉన్నారు. అలా రవిరాజపిల్లి శెట్టి దర్శకుడుగా ఎంపికయ్యారు ఆరోజుల్లోనే చంటి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఆ సినిమా వెంకటేష్‌కు తిరిగులేని స్టార్ డ‌మ్‌ను తెచ్చిపెట్టింది. ఆప్పటి నుంచి వరుసగా ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించే కథలలో నటిస్తూ వెంకటేష్ స్టార్ హీరో అయిపోయాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news