Moviesబాల‌య్య ' అన్‌స్టాప‌బుల్ 2 ' పై అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది...!

బాల‌య్య ‘ అన్‌స్టాప‌బుల్ 2 ‘ పై అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది…!

నందమూరి బాలకృష్ణ హోస్టుగా గత ఏడాది ఆహా ఓటీటీలో ప్రసరమైన క్రేజీ షో అన్‌స్టాప‌బుల్. మెగా కాంపౌండ్ లోని అల్లు అరవింద్ కు చెందిన ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో వచ్చిన ఈ షో సరికొత్త షోగా ఆవిష్కృతం అయింది. ఇప్పటివరకు ఎవరికీ కనబడని బాలయ్య‌లోని సరికొత్త కోణాన్ని కూడా ఆవిష్కరింపజేసింది. ఈ షోతో తొలిసారిగా హోస్ట్ గా వ్యవహరించిన బాలయ్య అద్భుతమైన టాలెంట్‌తో ఈ షోకు మంచి జోష్ తీసుకువచ్చారు. పలువురు సినిమా సెలబ్రెటీలు ఈ షోకు ప్రత్యేక గెస్టులుగా వచ్చి తమ సినిమా, పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు.

తెలుగు బుల్లితెరపై ఇప్పటికే ఎన్నో టాక్ షోలు వచ్చాయి. అసలు బాలయ్య టాక్ షో చేస్తే ప్రేక్షకులు చూస్తారా ? అన్న సందేహాలు పటాపంచలు అయిపోయాయి. తెలుగులో ఇప్పటివరకు ఎవరు హోస్ట్ చేయని విధంగా బాలయ్య టాక్ షో ఉంది. అసలు అన్‌స్టాప‌బుల్ టాక్ షోకు ముందు ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్‌ను పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. దీనిని సక్సెస్ చేసేందుకు అల్లు అర్జున్ తో పాటు చాలామంది ట్రై చేశారు. రాణా, సమంత లాంటి వాళ్ళను తీసుకువచ్చి ప్రత్యేకంగా టాక్ షోలు చేయించారు. అయితే అవేవీ క్లిక్ కాలేదు.

ఎప్పుడు అయితే బాలయ్య షో ఆహాలో వచ్చిందో అప్పటినుంచి ఆహా సబ్స్క్రైబ్స్‌ విపరీతంగా పెరిగిపోయారు. అన్‌స్టాప‌బుల్ సీజన్ వన్ సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు అందరూ సీజన్ 2 కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అందరిలోనూ ఆసక్తి నింపుతూ కొద్దిరోజుల క్రితం ఆహా అన్‌స్టాప‌బుల్ 2 త్వరలోనే ప్రారంభం అవుతుందని క్లారిటీ ఇచ్చింది. ఇక అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 గురించి మరో అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చేసింది.

సీజన్ 2 యొక్క యాంథ‌మ్ సాంగ్ త్వ‌ర‌లోనే రిలీజ్ చేస్తామని ఆహా అఫీషియల్ గా ఒక పోస్ట‌ర్‌ ద్వారా అనౌన్స్ చేసింది. ఇక అన్‌స్టాప‌బుల్‌ సీజన్ 2 ప్రారంభోత్సవం దుబాయ్ లో అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొదటి సీజన్ మించేలా మరింత జోరుతో సీజన్ 2 ఉంటుందట‌. ఆహా సీజన్ 2 బ్లాక్ బస్టర్ హిట్ చేసేందుకు అద్భుతమైన ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. సీజన్ 1 ఒంటి చేత్తో బ్లాక్ బస్టర్ హిట్ చేసిన బాలయ్య సీజన్ 2ను ఏ రేంజ్ లో రక్తిక‌ట్టిస్తారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news