Moviesఅబ్బాయిల మ‌గ‌త‌నాన్ని దాంతో పోల్చిన రెజీనా... వామ్మో మ‌రీ బ‌రితెగించిందిగా..?

అబ్బాయిల మ‌గ‌త‌నాన్ని దాంతో పోల్చిన రెజీనా… వామ్మో మ‌రీ బ‌రితెగించిందిగా..?

ఎస్ఎమ్ఎస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రెజీనా. మొద‌టి సినిమాతోనే రెజీనా అభిమానుల‌ను సంపాదించుకుంది. హాట్ లుక్స్ తో కుర్రాళ్లకు మ‌త్తెక్కిచింది. బ‌క్క ప‌ల్చ‌గా ఉండ‌డంతో పాటు క‌వ్వించే క‌ళ్లు, ఆమె హాట్ లుక్స్ కుర్ర‌కారును బాగా ఎట్రాక్ట్ చేశాయి. కెరీర్ ప్రారంభంలోనే ఈ అమ్మ‌డు ముద్దుల‌కు కూడా సై అంది. దాంతో చాలా సినిమా ఆఫ‌ర్ ల‌ను కూడా అందుకుంది. ముఖ్యంగా యూత్ లో రెజినా ఎక్కువ మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. కేవ‌లం హీరోయిన్ గానే కాకుండా నెగిటివ్ పాత్ర‌ల్లో న‌టించి కూడా అద‌ర‌గొట్టింది.

సినిమాల్లోనే కాకుండా రెజీనా సోష‌ల్ మీడియాలో కూడా రెచ్చిపోతోంది. కుర్రాళ్ల కోసం గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తూ వారికి పిచ్చెక్కిస్తోంది. దాంతో సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌ల్లో అభిమానులను సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ అవ్వ‌డంతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోగా చేసే స్కోప్ ఉన్నా రెజీనాకు ఆ స్టార్‌డ‌మ్ రాలేదు. ఆమెకు వ‌చ్చిన అతి పెద్ద హీరోయిన్ ఛాన్స్ ప‌వ‌ర్ సినిమాలో ర‌వితేజ ప‌క్క‌న రెండో హీరోయిన్ రోల్‌.

ఇక ఫేడ‌వుట్ అయిపోయాక చిరంజీవితో ఆచార్య‌లో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. ఇక రెజీనా కేవ‌లం రొమాంటిక్ ప్రేమ‌క‌థా చిత్రాల‌లోనే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల‌లోనూ న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ఇక రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ శాకిని ఢాకిని అనే సినిమాలో న‌టించింది. ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ నివేధిత థామ‌స్ కూడా న‌టించింది. ఈ శాకిని ఢాకిని త్వ‌ర‌లోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. దాంతో సినిమా ప్ర‌మోష‌న్స్ లో రెజీనా, నివేధిత ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో రెజీనా బోల్డ్ కామెంట్స్ చేయ‌గా అవి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

అంతే కాకుండా అబ్బాయిల మ‌గ‌త‌నం గురించి ప‌చ్చిగా మాట్లాడ‌టంతో అంతా షాక్ అవుతున్నారు. ఇంట‌ర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ….అబ్బాయిల మీద నాకు పెద్ద జోక్ ఉంది. కానీ ఇక్క‌డ నేను చెప్ప‌కూడ‌ద‌ని అనుకుంటునున్నాను అంటూనే చెప్పేసింది. మేల్ యాంక‌ర్ త‌న‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌గా రెజీనా అత‌డితో అబ్బాయిలు, మ్యాగీ రెండూ ఒక్క‌టే రెండు నిమిషాల్లో అయిపోతారు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక డ‌బుల్ మీనింగ్ జోక్ చెప్ప‌డ‌మే కాకుండా కాసేప‌టికి నీకు అర్థం అయ్యిందా అంటూ యాంక‌ర్ ను ప్రశ్నించింది. దానికి అత‌డు హా నాకు అర్థం అయ్యింది అంటూ అన్స‌ర్ ఇచ్చాడు. అంతే కాకుండా దాన్ని ఇక్క‌డ డిస్క‌స్ చేయొద్దు అంటూ తెలిపాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు రెజీనాపై మండిప‌డుతున్నారు. రెజీనా ఏంటి ఇలా బ‌రితెగించి మాట్లాడుతుంది అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news