Moviesఅబ్బ‌బ్బా... బాల‌య్య బంప‌ర్ అఫ‌ర్ మామూలుగా లేదుగా... పండ‌గ చేస్కోవ‌డ‌మే..!

అబ్బ‌బ్బా… బాల‌య్య బంప‌ర్ అఫ‌ర్ మామూలుగా లేదుగా… పండ‌గ చేస్కోవ‌డ‌మే..!

నట సింహం బాలయ్య ఇటీవల కాలంలో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. అటు వెండితెర మీద అఖండతో విశ్వరూపం చూపిస్తే ఇటు బుల్లితెరపై అన్‌స్టాప‌బుల్‌ షో తో విజృంభించారు. అఖండ దెబ్బతో బాలయ్య వ‌రుస పెట్టి స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మలినేని గోపీచంద్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమా పట్టాలు ఎక్కనుంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్, బోయపాటి శీను లైన్లో ఉన్నారు.

ఇక త్వరలోనే ఆహా ఓటీటీలో అన్‌స్టాప‌బుల్ షో సీజ‌న్ 2 కూడా హోస్ట్ చేయనున్నారు. ఇక ఫ్యూచర్ సినిమాల విషయంలో కూడా బాలయ్య యంగ్ హీరోలను మించిన స్ట్రాంగ్ లైన్ తో ఒక్కో సినిమాను సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా బాలయ్య స్ట్రాంగ్ లైన్ అప్‌లోకి మరో కొత్త దర్శ‌కుడు జాయిన్ అయ్యాడు. బాలయ్య.. కళ్యాణ్ రామ్ కోరిక మేరకు బింబిసార‌ సినిమా స్పెషల్ షో ఫ్యామిలీతో క‌లిసి వీక్షించాడు.

ఈ షో చూసిన అనంతరం బింబిసార సినిమా యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. రెండు, మూడు సినిమాలు తీసిన అనుభవం లేకుండానే తొలి సినిమాతోనే అద్భుతమైన ప్రయోగం చేసిన దర్శకుడు వశిష్ఠ్‌ మంచి విజయం సాధించారని బాలయ్య మెచ్చుకున్నారు. దర్శకుడు వశిష్ణ్‌ని ఉద్దేశించి థ్యాంక్స్ అయ్యా… త్వరలోనే మనం కలిసి చేద్దాం అంటూ వశిష్ఠ్‌కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు.

బాలయ్య ఒక్కసారిగా అంత మాట అనడంతో వశిష్ఠ్‌ తబ్బి ఉబ్బైపోయాడు. బాలయ్య నోట సహజంగా హామీ మాట రాదు. స్వయంగా ఆయనే ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పడంతో భవిష్యత్తులో వశిష్ఠ్‌ బాలయ్య కోసం మంచి కథ రెడీ చేసుకుంటే వీరిద్దరి కాంబినేషన్లో సోషియో ఫాంటసీ తరహా కథనంలో ఒక అద్భుతమైన సినిమాను మనం చూడవచ్చు. ఏదేమైనా వ‌శిష్ట్ ఇక పండ‌గ చేస్కోవ‌డ‌మే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news