Movies' బింబిసార ' 10 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్‌... క‌ళ్యాణ్‌రామ్‌కు ఎన్ని...

‘ బింబిసార ‘ 10 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్‌… క‌ళ్యాణ్‌రామ్‌కు ఎన్ని కోట్ల లాభం అంటే…!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు తన రేంజ్‌కు తగిన హిట్ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్లో హిట్లు వేళ్ళ మీద లెక్కపెట్టే స్థాయిలోనే ఉన్నాయి. కెరీర్ స్టార్టింగ్‌లో అతనొక్కడే ఆ తర్వాత హరేరామ్… గత ఐదారేళ్లలో పటాస్ -118 సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. అయితే ఇవేవీ భారీ లాభాలు అయితే తెచ్చి పెట్టలేదు. తాజాగా తన సొంత బ్యాన‌ర్‌ ఎన్టీఆర్ అర్ట్స్‌లో కొత్త దర్శకుడు మల్లిడి వశిష్టను దర్శకుడుగా పరిచయం చేస్తూ నిర్మించిన బింబిసార సినిమా సూపర్ హిట్ అయింది.

ఇంకా చెప్పాలంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డబుల్‌ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. కథ రొటీన్ కు భిన్నంగా ఉండడంతో పాటు దర్శకుడు వశిష్ఠ్‌ టేకింగ్, కళ్యాణ్ రామ్ విరోచిత నట విశ్వరూపం సినిమాలో బెస్ట్ విజువల్స్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర బింబిసార‌ ఏక చక్రాధిపత్యంతో దూసుకుపోయింది. మరోవైపు అదే రోజు రిలీజ్ అయిన సీతారామం సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా బింబిసారా ఆ సినిమాకు మించిన వసూళ్లు రాబట్టింది.

రెండో వారంలో కూడా బీ, సీ సెంటర్ల‌లో బింబిసార‌ దూకుడుగా ఉంది. ఇక తాజాగా పది రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏరియా వైస్ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం – 6.80 కోట్లు
సీడెడ్ – 5.51 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 2.89 కోట్లు
ఈస్ట్ – 1.99 కోట్లు
వెస్ట్ – 1.73 కోట్లు
గుంటూరు – 2.72 కోట్లు
కృష్ణా – 1.99 కోట్లు
నెల్లూరు – 1.68 కోట్లు
—————————————-
ఏపీ + తెలంగాణ = 26.59 కోట్ల షేర్‌
53. 18 కోట్ల గ్రాస్‌
————————–
రెస్టాఫ్ ఇండియా – 1.92 కోట్లు
ఓవ‌ర్సీస్ – 1.85 కోట్లు
10 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్ = 60.92 కోట్లు
10 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 30.46 కోట్లు

బింబిసార‌ పది రోజులకు వరల్డ్ వైడ్‌గా రు. 30.46 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే గ్రాస్ పరంగా చూస్తే 61 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ రు. 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ప్రస్తుత కలెక్షన్లతో పాటు బుకింగ్స్ బట్టి అంచనా వేస్తే ఈ సినిమా ఇప్పటికే భారీ లాభాలు సాధించింది. దీనికి తోడు నందమూరి అభిమానుల్లో ఎప్పుడు లేనంత యూనిటీ కూడా ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం బింబిసార‌ సినిమాకు దాదాపుగా రు. 35 – 40 కోట్ల లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ సినిమాతో కళ్యాణ్‌రామ్ పంట మామూలుగా పండ‌లేదని చెప్పుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news