Moviesబిగ్ షాకింగ్: విజయ్ దేవరకొండ సంచలన ప్రకటన..అయోమయంలో ఫ్యాన్స్..!?

బిగ్ షాకింగ్: విజయ్ దేవరకొండ సంచలన ప్రకటన..అయోమయంలో ఫ్యాన్స్..!?

ఈ రోజుల్లో ఓ సినిమా హిట్ అయితే..ఖచ్చితంగా ఆ సినిమా కి సీక్వెల్ తీయాలి అని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు..దానికి తగ్గట్లే ప్లాన్ చేసుకుంటున్నారు సినీ దర్శక నిర్మాతలు. ఇప్పటికే అలా మొదటి సినిమాను నమ్ముకుని వచ్చిన ఆల్ మోస్ట్ ఆల్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ అయ్యి..బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు కూడా సీక్వెల్ ని అనౌన్స్ చేసాయి. ఇదే క్రమంలో విజయ్ దేవరకొండ కూడా తన లైగర్ సినిమాకి సీక్వెల్ తీయ్యాలని ఆయన అభిమానులు ఆశ పడుతున్నారు.

మనకు తెలిసిందే..టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్..పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో “లైగర్” అంటూ మరి కొద్ది రోజుల్లోనే రాబోతున్నాడు. దీని కి సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు విజయ్. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా ఓ ఢిఫరెంట్ స్టైల్ లో చేస్తున్నారు టీం. కాగా,ఈ సినిమా ట్రైలర్ చూసిన జనాలు..ఇది గతంలో పూరీ తెరకెక్కించిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి..సినిమా స్టైల్ లో ఉంది అంటూ ట్రోల్ చేసారు.

రిలీజైన పోస్టర్స్ ని గతంలో సీన్స్ కి మ్యాచ్ చేస్తూ..ఇది అదే కధ..ఇక ఈ సినిమాని చూడటం వేస్ట్ అంటూ..కొందరు కామెంట్స్ చేసారు. దీంతో..విజయ్ స్పందిస్తూ..”మీరు అనుకున్నట్లు ఈ సినిమా అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాకి రీమేక్ కాదు..ఆ స్టోరీకి లైగర్ కి సంబంధమే లేదు..ఇది ఓ కొత్త ఢిఫరెంట్ స్టోరీ. అయినా నేను ఎప్పటికి రీమెక్ సినిమాలు చేయను..”అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో లైగర్..మూవీకి కూడా సీక్వెల్ రాదు అని పరోక్షంగా చెప్పేశాడు..అంటూ ఫ్యాన్స్ డిస్సపాయింట్ మెంట్ లో ఉన్నారు. మరి చూడాలి లైగర్ సినిమా విజయ్ కి ఎలాంటి విజయం అందిస్తుందో..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news