Moviesఒక్క నిర్ణయంతో టాలీవుడ్ డైరెక్టర్ల నోరు మూయించిన బింబిసార దర్శకుడు..నువ్వు సూపరహే..!?

ఒక్క నిర్ణయంతో టాలీవుడ్ డైరెక్టర్ల నోరు మూయించిన బింబిసార దర్శకుడు..నువ్వు సూపరహే..!?

బింబిసార నిన్న మొన్నటి వరకు ఈ పేరు చాలా తక్కువ మందికే తెలుసు. కానీ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ పుణ్యమా అంటూ ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. రీసెంట్ గా తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. ఈ సినిమాకి సీక్వెల్ కూడా తీయబోతున్నాను అని ప్రకటన చేశారు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే హీరో కళ్యాణ్ రామ్ ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. తన కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన బింబిసార.. ఆయన కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచి.. తన కెరియర్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ నెలకోల్పింది.

ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ డైరెక్టర్ వశిష్ట. టైం ట్రావెల్ కథతో సినిమాలు అంటే చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలి. పాస్ట్ ని ఫ్యూచర్ ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జనాలకు అర్థమయ్యే విధంగా చూయించాలి. ఆ విషయంలో డైరెక్టర్ వశిష్ట సూపర్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా టైం ట్రావెల్స్ ఎలిమెంట్స్ ఆధారంగా చూయించి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు. నిజానికి డైరెక్టర్ వశిష్ట కు ఇదే మొదటి సినిమా . కొత్త డైరెక్టర్ ను నమ్మి కళ్యాణ్ రామ్ ఇలాంటి అవకాశం ఇవ్వడంతో ఆయన లైఫ్ మారిపోయింది. వశిష్ట కూడా నందమూరి హీరో నమ్మకాన్ని నిలబెట్టాడు.

కాగా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పక్కా కమర్షియల్ గా ఆలోచిస్తూ డైరెక్టర్ వశిష్ట తన పారితోషకానీ భారీగా పెంచేసాడట. అంతా ఇంత కాదు బింబిసార సినిమాకు మూడు కోట్లను పారితోషకంగా తీసుకున్న వశిష్ట ..ఇప్పుడు తన తదుపరి సినిమాకు ఏకంగా ఆరు కోట్లు డిమాండ్ చేస్తున్నాడట . ఇది నిజంగా షాకింగ్ విషయం అనే చెప్పాలి. ఇప్పటివరకు మన టాలీవుడ్ డైరెక్టర్లు ఎవరూ కూడా ఇలా ఒక్కసారిగా తమ రెమ్యూనరేషన్ డబుల్ చేసిన దాఖలాలు లేవు . దీంతో టాలీవుడ్ డైరెక్టర్లకు బిగ్ షాక్ ఇచ్చినట్లైంది డైరెక్టర్ వశిష్ట. కొందరు ఈ రోజుల్లో ఇలా పక్కా కమర్షియల్ గా ఉంటేనే సక్సెస్ అవుతారు గురూ అంటూ వశిష్టను పొగిడేస్తున్నారు.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news