Moviesఛాన్సుల కోసం తేజ‌స్విని బెడ్ రూమ్‌కు పిలిచింది ఎవ‌రు... ఇంత జ‌రిగిందా...!

ఛాన్సుల కోసం తేజ‌స్విని బెడ్ రూమ్‌కు పిలిచింది ఎవ‌రు… ఇంత జ‌రిగిందా…!

సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాలో స‌మంత‌కు చెల్లెలిగా న‌టించిన బ్యూటీ తేజ‌స్వి మ‌డివాడ‌. ఓ ఫంక్ష‌న్ లో మ‌హేశ్ బాబును చూసి మొద‌టి చూపుకే ప‌డిపోయిన అమ్మాయిలా న‌టించి తేజ‌స్వి ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌ర‌వాత చాలా సినిమాల్లో తేజ‌స్వి చిన్న చిన్న పాత్ర‌ల‌ను ద‌క్కించుకుంది. అంతే కాకుండా రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత తేజ‌స్వి అడ‌పాద‌డ‌పా సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.

అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టిన త‌ర‌వాత అంద‌రిలానే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లో బోల్డ్ బ్యూటీగా తేజ‌స్వి పేరు సంపాదించుకుంది. ఇక తేజ‌స్వి సోష‌ల్ మీడియాలోనూ త‌న ఫోటోల‌తో రెచ్చిపోతూ ఉంటుంది. బాలీవుడ్ హీరోయిన్ రేంజ్ లో గ్లామ‌ర్ షో చేస్తూ ఉంటుంది. దాంతో ఈ అమ్మ‌డికి సోష‌ల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే సినిమా ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం హాట్ టాపిక్ గానే ఉంటుందన్న సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోయిన్లుగా రానిస్తున్న‌వాళ్లు ఎప్పుడూ కూడా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడ‌రు.

కానీ అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టిన‌వాళ్లు.. సీనియ‌ర్ హీరోయిన్ లు మాత్రం కాస్టింగ్ కౌచ్ పై స‌మయాన్ని బ‌ట్టి స్పందిస్తూ బాంబులు పేలుస్తుంటారు. అప్ప‌ట్లో తేజ‌స్వి మ‌దివాడ కూడా ఓ మీడియా ఇంటర్వ్యూలో అలాంటి కామెంట్లనే చేసింది. బాలీవుడ్ స్టార్స్ దేనికైనా సిద్ద‌ప‌డ‌తార‌ని… ఏం అడిగినా నో చెప్ప‌ర‌ని అందుకే వాళ్ల‌ని తీసుకుంటార‌ని సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేసింది. అందులో 20 శాతం మంది వ‌ల్లే త‌మ‌లాంటి వారిని కూడా అదే తీరుగా చూస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

త‌నను టాలీవుడ్ కు వ‌చ్చిన కొత్తల్లో బెడ్ రూమ్ కి వస్తావా ? అని అడిగిన‌వాళ్లే ఎక్కువ‌ని చెప్పింది. కానీ అలా అడ‌గ‌కుండా దానికి క‌మిట్మెంట్ అని పేరు పెట్టారని వ్యాఖ్యానించింది. తాను క‌మిట్మెంట్ కు ఒప్పుకోలేదు కాబ‌ట్టే టాలీవుడ్ లో అవ‌కాశాలు రాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. టాలీవుడ్ లోకి వ‌చ్చేవారు మారుతున్న కాలానికి అనుగుణంగా క‌మిట్మెంట్ కు సిద్ద‌ప‌డే వ‌స్తున్నార‌ని కామెంట్స్ చేసింది. ఇక తేజ‌స్వి చేసిన కామెంట్స్ వైర‌ల్ అవ‌డంతో ఈ అమ్మ‌డిని బెడ్రూంకు పిలిచింది ఎవ‌ర‌న్న చ‌ర్చ అప్ప‌ట్లో హైలెట్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news