Moviesక‌స్తూరి - నాగార్జున మ‌ధ్య అంత క‌థ న‌డిచిందా...? షూటింగ్‌ మ‌న్మ‌థుడు...

క‌స్తూరి – నాగార్జున మ‌ధ్య అంత క‌థ న‌డిచిందా…? షూటింగ్‌ మ‌న్మ‌థుడు చేసిన ప‌నికి రోజంతా…?

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున‌కు ఉన్న లేడీస్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌వ‌స‌రం లేదు. నాగార్జున‌ను బ‌య‌టి అమ్మాయిలే కాకుండా హీరోయిన్ లుగా కూడా ఎంత‌గానో ఇష్ట‌ప‌డేవారు. టాలీవుడ్‌కు చెందిన ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ టబు – నాగార్జున‌ను ప్రేమించి ఆయ‌న ద‌క్క‌క‌పోవ‌డం వ‌ల్లే లైఫ్ లో పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయిందన్న‌ వార్త‌లు త‌రచూ వినిపిస్తూనే ఉంటాయి. ఇక నాగ్ ఆర‌వై దాటిన త‌న కుమారుల‌కు పోటీగా సినిమాలు చేస్తూ వారికి అన్న‌లా క‌నిపిస్తూ ఉంటారు. దాంతో ఇప్ప‌టికీ నాగ్ కు అమ్మాయిల్లో క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు.

కాగా తాజాగా ఒక‌ప్ప‌టి హీరోయిన్ ప్ర‌స్తుతం సీరియ‌ల్ హీరోయిన్ అయిన క‌స్తూరి కూడా నాగార్జునపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ప్ర‌స్తుతం గృహ‌ల‌క్ష్మి సీరియ‌ల్ లో ముఖ్య‌మైన పాత్రలో న‌టిస్తోంది. ఈ సీరియ‌ల్ తో ఎంతో మంది ఫ్యామిలీ ఆడియ‌న్స్ మ‌న‌సు దోచుకుంటోంది. అంతే కాకుండా సీరియ‌ల్ లో ఎంతో ప‌ద్ధ‌తిగా క‌నిపించే క‌స్తూరి సోష‌ల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది. ఇప్ప‌టి యంగ్ హీరోయిన్ల‌కు షాక్ ఇచ్చే రేంజ్ లో గ్లామ‌ర్ ఫోటోల‌ను షేర్ చేస్తోంది. అంతే కాకుండా వీలైన‌ప్పుడల్లా హాట్ కామెంట్స్ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది.

అయితే ఒక‌ప్పుడు మాత్రం క‌స్తూరి తెలుగుతో పాటూ త‌మిళ, మ‌ల‌యాళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్ గా అల‌రించింది. నాగార్జున సూపర్ హిట్ సినిమాలోనూ క‌స్తూరి న‌టించి అల‌రించింది. కాగా ఓ ఇంట‌ర్వ్యూలో క‌స్తూరి మాట్లాడుతూ త‌న ఫ్యామిలీ లైఫ్ గురించి సినిమా లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. ఈ నేప‌థ్యంలోనే హీరో నాగార్జున గురించి మాట్లాడుతూ…టాలీవుడ్ కింగ్ నాగార్జున‌ను చూసి నేను ప్రేమ‌లో ప‌డిపోయా అంటూ కామెంట్స్ చేసింది. నాగార్జున అంటే నాకు క్ర‌ష్ అని పెద్ద బాంబే పేల్చింది.

నాగార్జున న‌టించిన అన్న‌మ‌య్య‌, ఆకాశ‌వీధిలో సినిమాల్లో ఆమె న‌టించింది. అన్న‌మ‌య్య షూటింగ్ స్పాట్ లో నాగార్జున షేక్ హ్యాండ్ ఇచ్చిన రోజు ఆ చేతిని ఎవ‌రినీ ముట్టుకోనివ్వ‌లేద‌ని చెప్పింది. అంతే కాకుండా ఆ చేతిని క‌డ‌గ‌కుండా అలాగే ప‌ట్టుకున్నా అంటూ ఆనందం వ్య‌క్తం చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news