Moviesబాలయ్య కు సిస్టర్ గా ఆ స్టార్ డాటర్..నందమూరి అభిమానులకు ఊపు...

బాలయ్య కు సిస్టర్ గా ఆ స్టార్ డాటర్..నందమూరి అభిమానులకు ఊపు తెప్పించే అప్డేట్ ..సూపరో సూపర్..!?

“ఇది కథ నందమూరి అభిమానులకు ఊపు తెప్పించే అప్డేట్ అంటే. ఇది ఇలా ఉండాలి సినిమా అంటే.. సినిమాకు సంబంధించిన అప్డేట్ అంటే” ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. ఆఫ్ కోర్స్ నందమూరి బాలయ్య సినిమా అప్డేట్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. అభిమానులు ఆ మాత్రం హంగామా చేయాల్సిందే. లేకపోతే అది బాలయ్య సినిమా లా కనిపించదు. మనకు తెలిసిందే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి బాలకృష్ణ.. ప్రజెంట్ డైనమిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక మాస్ పవర్ఫుల్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో కనిపిస్తారని ఇప్పటికే అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే దాదాపు 50 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా బాలకృష్ణ సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో కొన్ని పిక్స్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో మనం చూసాం . ఇందులో మరీ ముఖ్యంగా జై బాలయ్య సాంగ్ అంటూ వచ్చే పాటకు బాలకృష్ణ అలా నడుస్తూ ఉంటే అక్కడున్న జనాలు పూలు చల్లడం చాలా వైరల్ గా మారింది. అంతేకాదు బాలకృష్ణ సెట్స్ లో ఉన్నప్పుడు సెట్స్ లో బాలకృష్ణను చూడడానికి అభిమానులు వచ్చినప్పుడు కొన్ని పిక్స్ నెట్టింట లీక్ అయ్యాయి. ఈ లుక్ లో బాలకృష్ణ సూపర్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి.

ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా స్టార్ డాటర్ శృతిహాసన్ నటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాలో మరో స్టార్ డాటర్ కూడా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె సినిమాలో నెగటివ్ రోల్ చేయట్లేదట. బాలకృష్ణకు సిస్టర్ గా చేస్తుందట. ఆ రోల్ వరలక్ష్మి తప్పిస్తే మరెవ్వరూ చేయలేదు అంటున్నారు మేకర్స్ . దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ బాలకృష్ణ పేర్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ పాత్ర వరలక్ష్మి శరత్ కుమార్ కి కొత్త లైఫ్ ఇవ్వబోతుంది అంటున్నారు నందమూరి అభిమానులు . తెరపై చెల్లిగా వరలక్ష్మి అన్నగా బాలయ్య కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారని అంటున్నారు ఫాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news