Moviesపూరి ఛార్మీని వ‌దిలేస్తున్నాడా... ఇప్ప‌టికైనా నిజం అర్థ‌మైందా...!

పూరి ఛార్మీని వ‌దిలేస్తున్నాడా… ఇప్ప‌టికైనా నిజం అర్థ‌మైందా…!

పూరికి ఛార్మీ వల్ల మైనసే అని ఇప్పటికైనా గ్రహిస్తాడా..? ఇప్పుడు నెటిజన్స్ కొందరు గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. అసలు పూరి పక్కన ఛార్మి అనవ‌స‌రం అని కూడా ఇదే నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జోతిలక్ష్మి సినిమాతో పూరి – ఛార్మీ కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ స్థాపించి ఇద్దరు నిర్మాతలుగా సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఆశించినత సక్సెస్ సాధించడం లేదు. ఒక్క ఇస్మార్ట్ శంకర్ తప్ప మిగతా సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచాయి.

Five reasons why you should watch iSmart Shankar!

ఇస్మార్ట్ శంక‌ర్‌కు ముందే వీళ్లు అప్పుల్లో కూరుకుపోయారు. ఆ సినిమా దెబ్బ‌తో వీళ్లు అప్పులు తీర్చేసుకుని భారీ లాభాల్లోకి వ‌చ్చేశారు. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్‌తో పూరి లైగర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా పూరి కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. విజయ్ దేవరకొండ కెరీర్‌లో కూడా ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. అందుకే, అందరికంటే ఎక్కువ హడావుడి చేసింది ఛార్మి.

విజయ్ దేవరకొండను నా బంగారు కొండ అని చెప్పుకొచ్చింది. ఇలాంటి హీరో ఇండస్ట్రీలో ఇంకొకడు లేడు అని పూరి జగన్నాథ్ కూడా పొగిడేశాడు. ఇదంతా చూసి లైగర్ టీం మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఉంది అని మాట్లాడుకున్నారు. ఇదంతా పక్కన పెడితే, విజయ్ ప్రమోషన్స్ లో మాట్లాడింది చూసే సినిమా ఫ్లాప్ అని డిసైడయ్యారు. ఇక ఛార్మీ చేసిన ఓవర్ యాక్షన్ మరో మెట్టు. సినిమా హిట్ టాక్ వస్తే వేరేలా ఉండేమో గానీ..డిజాస్టర్ అనగానే ఓ ఆట ఆడుకుంటున్నారు.

అసలు ఛార్మీ వల్ల పూరికి ఒరుగుతుందేంటీ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకరికొకరు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంతేకాదు, అసలు పూరి, చార్మీని వదిలేస్తే గానీ సక్సెస్‌లు రావని చెప్పుకుంటున్నారు. నిజంగా ఇది జరుగుతుందా లేదా తెలీదు గానీ, ఇప్పటి వరకు పూరి, ఛార్మీల జర్నీ చూస్తే వీరి కాంబోలో వచ్చిన హిట్స్ ఏమీ లేవనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు జనగణమన సినిమా తెరకెక్కుతోంది.

Jana Gana Mana to Begin Next Week

దీని ప్రభావం గట్టిగానే ఉండేలా ఉంది. పూరి, సినిమాలు ఇప్పుడు టీజర్‌కి ఎక్కువ ట్రైలర్‌కి తక్కువ అని డిసైడ్ అవుతున్నారు. ఎలాంటి సినిమాలు తీసిన పూరి ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నారు అని జనాలు మాట్లాడుకోవడంలో తప్పు కూడా లేదు. మరి ఛార్మీ వల్ల పూరికి ఉన్న మైనస్ ఏంటో ఎప్పుడు గ్రహిస్తాడో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news