Moviesవిగ్నేశ్ తొందరపాటు..హాస్పిటల్ లో అడ్మిట్ అయిన నయనతార..!?

విగ్నేశ్ తొందరపాటు..హాస్పిటల్ లో అడ్మిట్ అయిన నయనతార..!?

సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ నయన తార గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరీర్ మొదట్లో చిన్నా చితకా పాత్రల్లో నటించినా..ఆ తరువాత మాత్రం మంచి మంచి రోల్స్ అందుకుని..తనలోని నటి ని బయటకు తీసుకొచ్చింది. అలా అలా మెల్లగా ఇప్పుడు టాప్ హీరోయిన్ల లిస్ట్లోకి వెళ్లిపోయింది. అంతేనా, ఇప్పుడు సౌత్ లోనే క్రేజీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఈ బ్యూటీ.

బాలీవుడ్ బడా హీరోయిన్స్ అలియా, దీపికా పదుకునే కన్నా అమ్మడునే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటుందట. ఇప్పుడు ఒక్కో సినిమాకి నయనతార 10 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. కాగా, రీసెంట్ గా నే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార…ప్రజెంట్ మ్యారిడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. భర్త తో గుడులు సందర్శిస్తూనే…మరో వైపు సినిమాలోను నటిస్తూ బిజీగా ఉంది.

అయితే, భర్త చేసిన పనికి నయనతార హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే వరకు వెళ్లిందని కోలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. వీకెండ్ కావడంతో నయన్ కు సర్ప్రైజ్ గా ఓ స్పెషల్ రెసిపీని చేసి పెట్టాడట విగ్నేశ్. అది కాస్తా బెడిసికొట్టడంతో..నయన్ కు ఫుల్ వాంతింగ్స్ ..అవ్వడంతో స్కిన్ కూడా ఇన్ ఫెక్షన్ వచ్చి..హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే వరకు వచ్చిందట. కొన్ని గంటలు అబ్ సర్వేషన్ లో ఉంచిన నయనతారను ..ఆ తరువాత డిశ్చార్జ్ చేసారట. ఈ న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news