Moviesమీరు మళ్లీ ప్రేమిస్తారా..? నాగ చైతన్య ఆన్సర్ వింటే...

మీరు మళ్లీ ప్రేమిస్తారా..? నాగ చైతన్య ఆన్సర్ వింటే దండం పెట్టాల్సిందే..!!..!!

అక్కినేని నాగచైతన్య ..సినిమాల పరంగా ఏమో కానీ, ఈ మధ్య కాలంలో విడాకుల కారణంగా మీడియాలో హైలెట్ గా నిలుస్తున్నారు. స్టర్ హీరోయిన్ సమంత ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈయన..కొని నెలలు క్రితమే..ఏవో మిస్ అండర్ స్టాండింగ్స్ కారణంగా..విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యాడు. ఏ రోజు అయితే విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించాడో..ఆ రోజు నుండి నాగ చైతన్య మీడియాలో హాట్ టాపిక్ గా ట్రోల్ అవుతున్నాడు .

కాగా, ఇవి చాలవు అన్నట్లు రీసెంట్ గా సమంత కాఫీ విత్ కరణ్ షోలో నాగచైతన్య పై సంచలన వ్యాఖ్యలు చేసింది. “మా విడాకులు ఏం కూల్ గా జరగలేదు అని చెప్పిన ఈవిడ…కనీసం ఆయన పేరుని కూడా పలకడానికి ఇష్టపడలేదు. అంతేనా, వాళ్ళ ఇద్దరిని ఒక్కే రూమ్ లో పెడితే ఖచ్చితంగా పదునైన వస్తువులు ఉంచాలి అని కోరింది. దీంతో సమంత మాటలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. కానీ, ఇంత వరకు నాగ చైతన్య సమంత పై ఒక్క మాట కూడా నెగిటీవ్ గా స్పందించలేదు.

అయితే, రీసెంట్ గా లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలోరిపోర్టర్..” మీరు మళ్లీ ప్రేమలో పడే అవకాశం ఉందా? ” స్ట్రైట్ గా అడగగా నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ సమాధానమిస్తూ.. ”తప్పకుండా మళ్లీ ప్రేమలో పడతాను. ఎవరికి తెలుసు భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ప్రేమ అనేది మనిషి జీవించడానికి చాలా అవసరం. మనం బ్రతకడానికి ఊపిరి ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే అవసరం. మనం ప్రేమించాలి. ఎదుటివారి ప్రేమను సొంతం చేసుకోవాలి. అలా జరిగితేనే మనం హ్యాపీగా ఆరోగ్యంగా, పాజిటివ్‌గా ఉంటాం” అని చెప్పుకొచ్చాడు నాగచైతన్య. దీంతో ఆయన ఖచ్చితంగా మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అని చెప్పకనే చెప్పేసాడు ఈ అక్కినేని హీరో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news