Moviesనంద‌మూరితో ' అల్లు ' కుంటోన్న ఐకాన్ స్టార్ బంధం.. క‌ళ్యాణ్‌...

నంద‌మూరితో ‘ అల్లు ‘ కుంటోన్న ఐకాన్ స్టార్ బంధం.. క‌ళ్యాణ్‌ గారు అంటూ…!

టాలీవుడ్లో ఎవ్వ‌రితోనూ ఇగోలు, శ‌తృత్వం లేకుండా త‌న కెరీర్‌ను డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. ఇండ‌స్ట్రీలో పెద్ద హీరోల అభిమానుల మ‌ధ్య తెలియ‌ని ఇగోలు, త‌మ హీరోయే గ‌ప్ప అన్న ఫీలింగులు ఉంటాయి. కానీ బ‌న్నీ మాత్రం అంద‌రితోనూ స‌ఖ్య‌త‌తో ఉంటూ నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌పై ఫోక‌స్ పెట్టి దూసుకుపోతున్నాడు. బ‌న్నీ మెగా కాంపౌండ్ ముద్ర నుంచి ఎప్పుడో బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు.

 

ఎన్టీఆర్‌ను బావ అంటూ అప్యాయంగా పిలుస్తాడు.. సోష‌ల్ మీడియాలో ఎన్టీఆర్ – బ‌న్నీ ఒక‌రి సినిమాల‌పై మ‌రొక‌రు ప్ర‌శంస‌లు కురిపించుకుంటారు. అలా ఎన్టీఆర్‌తో వ‌ర‌స క‌లిపేంత‌గా స్నేహం పెంచుకున్న బ‌న్నీ ఆ త‌ర్వాత త‌మ ఆహా ఓటీటీ డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ కోసం ఏకంగా న‌ట‌సింహం బాల‌కృష్ణ‌కు స్వ‌యంగా ఫోన్ చేసి మ‌రీ టాక్ షో చేసేందుకు ఒప్పించారు. అస‌లు ఇది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనే సంచ‌ల‌న‌మైంది.

అలాగే బాల‌య్య అఖండ సినిమా ఈవెంట్‌కు బ‌న్నీయే గెస్ట్‌గా వెళ్లి మ‌రింత ఆశ్చర్య ప‌రిచాడు. ఇది మెగాభిమానుల్లో కాస్త క‌ల‌వ‌ర‌పాటుతో పాటు కొంద‌రిలో బ‌న్నీపై కోపానికి కార‌ణ‌మైంది. అయినా కూడా బ‌న్నీ వెన‌క్కు త‌గ్గలేదు. నంద‌మూరి ఫ్యామిలీతో త‌మ ఫ్యామిలీ బంధం అల్లుకుపోయేలా చేస్తున్నాడు. వాస్త‌వంగా చూస్తే ఈ రెండు కుటుంబాల మ‌ధ్య బంధం ఈ నాటిది కాదు. అల్లు రామ‌లింగ‌య్య‌, ఎన్టీఆర్ ఎంతో స్నేహంగా ఉండేవారు.

అల్లు రామ‌లింగ‌య్య ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తార‌కం వంట చేస్తుంటే వంటిట్లోకి వెళ్లి మ‌రీ మా బండోడికి ( ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ) ఏం వండుతున్నావ్ అనేంత చ‌నువు ఉంది. ఆ త‌ర్వాత అల్లు అర‌వింద్ – బాల‌య్య మ‌ధ్య అంత బంధం లేక‌పోయినా.. అన్‌స్టాప‌బుల్ షో త‌ర్వాత ఇది మ‌రింత స్ట్రాంగ్ అయ్యింది. అనిల్ రావిపూడి సినిమా త‌ర్వాత గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్లో బాల‌య్య హీరోగా సినిమా చేసేందుకు ప్ర‌య‌త్నాలు కూడా న‌డుస్తున్నాయి.

ఇక ఇప్పుడు బ‌న్నీ మ‌రో నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. క‌ళ్యాణ్‌రామ్ బింబిసార సినిమా రిలీజ్ అయ్యి సూప‌ర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విధ్వంసం క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు ఇండ‌స్ట్రీ స్టార్ హీరోల నుంచి ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఐకాన్ స్టార్ బ‌న్నీ బింబిసార యూనిట్‌కు కంగ్రాట్స్ చెప్ప‌డంతో క‌ళ్యాణ్ గారు అంటూ అత‌డి ప్రెజెన్స్‌తో అద‌ర గొట్టేశాడ‌ని… కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డంతో పాటు ఈ త‌ర‌హా అద్భుత సినిమాను ఇండ‌స్ట్రీలోకి తీసుకువ‌చ్చినందుకు, ఆయ‌న ఎఫ‌ర్ట్‌కు నా గౌర‌వ ధ‌న్య‌వాదాలు అంటూ అద్భుతంగా కొనియాడేశాడు.

అలాగే ఈ త‌ర‌హా సినిమాను ఇంత అద్భుతంగా హ్యాండిల్ చేసినందుకు కొత్త ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ఠ్‌ను కూడా అభినందించాడు. టెక్నీషియన్స్ ఎం ఎం కీరవాణి ఇతర ఆర్టిస్టుల‌కు కూడా బ‌న్నీ త‌న అభినంద‌న‌లు తెలిపాడు. ఇలా బ‌న్నీ నంద‌మూరి ఫ్యామిలీతో త‌న బంధాన్ని మ‌రింత‌గా పెన‌వేసుకుంటున్నాడ‌నే చెప్పాలి. క‌ళ్యాణ్‌రామ్ సినిమాల‌పై బ‌న్నీ స్పందించ‌డం ఇదే తొలిసారి.

 

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news