MoviesHappy Birthday MaheshBabu: పార్టీ లేదా మహేశా..!?

Happy Birthday MaheshBabu: పార్టీ లేదా మహేశా..!?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు పుట్టినరోజు ఈ రోజు. అంటే అభిమానులకు ఓ పండగ రోజు అనే చెప్పాలి. సినీ ఇండస్ట్రీలో మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి..ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కూల్ గా తన పని తాను చేసుకుపోయే మహేశ్ అంటే సినీ స్టార్స్ కి కూడా ఇష్టమే. సర్కారు వారి పాట సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో..ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాతో మరో హిట్ ను అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.

మనకు తెలిసిందే SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో మహేశ్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ తో కమిట్ ఆయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. మరో హీరోయిన్ కన్నడ బ్యూటి కృతి శెట్టి ఫిక్స్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, జనరల్ గా ఇలా స్టార్ హీరోల పుట్టిన రోజు నాడు అభిమానులకు బర్త డే ట్రీట్ గా తమ నెక్స్ట్ సినిమా నుండి ఏదో ఒక్క అప్ డేట్ ఇస్తారు. సినిమా టైటిల్, కఫస్ట్ లుక్ , ఫస్ట్ పోస్టర్..ఏదో ఒక్కటి ఇచ్చి అభిమానులను ఉత్సాహ పరుస్తారు.

కానీ, ఈసారి మహేశ్ అభిమానులకు నిరాశే మిగిలింది. ఆయన SSMB28 సినిమా నుండి ఒక్క అప్ డేట్ రాలేదు. కారణాలు చాలానే ఉన్నా..అభిమానులు మాత్రం డిస్సపాయింట్ అవుతున్నారు. ఎంతో ఆశగా ఈ రోజు త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన అప్ డేట్ వస్తుందని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. కానీ, స్టార్ హీరోలు, డైరెక్టర్లు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ అనిల్‌ రావిపూడి, వంశీ పైడిపల్లి, శ్రీనువైట్ల, సాయిధరమ్ తేజ్, సుధీర్ బాబు, సురేందర్ రెడ్డి, అడవి శేష్ పలువురు సినీ ప్రముఖులు మహేశ్‌కు సోషల్‌ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. దీంతో సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో మహేశ్‌ బాబు బర్త్ డే ట్యాగ్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news