Moviesటిక్ టాక్ భాను ఒక్క రోజు రేటు ఎంతో తెలుసా..? దిమ్మ...

టిక్ టాక్ భాను ఒక్క రోజు రేటు ఎంతో తెలుసా..? దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!

సోషల్ మీడియా కొందరి జీవితాల్లో నిప్పులు పోసి విషాదం నింపితే..మరి కొందరి జీవితాలో అవకాశాలు తెప్పించి కొత్త లైఫ్ ఇచ్చింది. తమ లోని టాలెంట్ ను ఎవ్వరు ఆపలేరు..అంటూ సోషల్ మీడియా వేదికగా..తమ అద్భుతమైన టాలెంట్ ను బయటపెడుతూ.. ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రిటీలు గా మారారు కొందరు సామాన్య ప్రజలు. అలాంటి లిస్ట్ లోకి చాలా మందే వస్తారు. షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనా, దేత్తడి హారిక, హర్ష, ఇదిగో ఈ భాను..ఇలా బోలెడు మంది సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను నమ్మి మంచి గా సెటిల్ అయ్యారు.

భాను అంటే పెద్దగా గుర్తు పట్టక పోవచ్చు కానీ..టిక్ టాక్ భాను అంటె మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు. టిక్ టాక్ వీడియో ల ద్వారా ఫేమస్ అయిన భాను..ఇప్పుడు జబర్దస్త్‌ భాను గా పేరు సంపాదించుకుంది. ఈ మధ్య ఈ అమ్మాయి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. అమ్మడుకి సోషల్ మీడియాలో పిచ్చెక్కించే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె ఇన్ స్టా లో చేసే రీల్స్ తో పాటు యూట్యూబ్ లో వీడియోలతో తెగ పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఈమె జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ లో చేసే హంగామా అంతా ఇంతా కాదు.

అమ్మడు చీర కట్టి డ్యాన్స్ చేస్తే..కుర్రాళ్ల గుండెలు జారిపోవాల్సిందే . అంత హాట్ పర్ ఫామెన్స్లు ఇస్తూ మంచి టఫ్ కాంపిటీషన్స్ ఇస్తుంది. అయితే, భాను రెమ్యూనరేషన్ గురించి..ఆమె ఒక్క కాల్ షీటు కి ఎంత తీసుకుంటుంది అని చాలా మందికి రకరకాల డౌట్లు ఉన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ హాట్ బుల్లితెర బ్యూటీ ఒక్క రోజు కాల్షీట్ కి లక్ష 25 వేల రూపాయలు తీసుకుంటుందట. ఇంత పెద్ద మొత్తంలోమల్లెమాల వారు మాత్రమే ఇస్తున్నారట. మిగతా ఈవెంట్స్ కి  50 వేలు-75 వేలు తీసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటుందని మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అమ్మడు ఎక్స్ ప్రేషన్స్ క్వీన్ అంటారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news