Moviesప్రభాస్ కి ఆ వ్యసనం ఉందనే సంగతి మీకు తెలుసా..? బాహుబలి...

ప్రభాస్ కి ఆ వ్యసనం ఉందనే సంగతి మీకు తెలుసా..? బాహుబలి సెట్స్ లో అదే పని ..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి క్యారెక్టర్ నైనా సరే కొట్టిన పిండిగా తన నటనతో అభిమానులను మెప్పించగలడు. అంత సత్తా ఉన్న టాలెంటెడ్ ఉన్న హీరో. చిన్న హీరోగా తన సినీ కెరియర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు బడా బడా సినిమాలతో పక్కాగా చెప్పాలంటే.. పాన్ ఇండియా సినిమాలతో దేశాన్ని షేక్ చేస్తున్నాడు. అంతేకాదు ఆయన నటించిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో మనకు తెలిసిందే. ప్రభాస్ కెరియర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా సరే బాహుబలి లాంటి సినిమా మళ్లీ ఆయన తీయలేరు అనే చెప్పాలి. ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ ఆయన స్టైల్ ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్ని సూపర్ గా ఉంటాయి.

కాగా ప్రభాస్ ప్రస్తుతం చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ హీరోగా చేస్తున్న సల్లార్ ,ప్రాజెక్ట్ కే షూటింగ్ దశలో ఉండగా ..ఆది పురుష్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలు అయిపోగానే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో మరో ప్రతిష్టాత్మకమైన సినిమాను తెరకెక్కించడానికి రెడీగా ఉన్నాడు . ఆ తర్వాత మరోసారి రాజమౌళితో మరో అద్భుతమైన సినిమా తీద్దామని ఇప్పటికే ప్రభాస్ ప్రకటించాడు.

కాగా రీసెంట్ గా ప్రభాస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసింది బాహుబలి నటి. బాహుబలి సినిమాలో చిన్న పాత్ర నటించిన ఈమె రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. మనకు తెలిసిందే ప్రభాస్ మంచి ఫూడి. కానీ లిమిట్ గా తింటారు. ప్రభాస్ తాను తినడంతో పాటు అందరికీ కడుపునిండా భోజనం పెడతాడు. ఈ విషయం చాలామంది చెప్పారు. కానీ ఈ నటి ప్రభాస్ గురించి కామెంట్ చేస్తూ ప్రభాస్ కు అన్నం వదిలితే మహా కోపం వచ్చేస్తుందని చెప్పింది.

ప్రభాస్ బాహుబలి షూటింగ్ సెట్స్ లో ప్రతి ఒక్కరికి భోజనాలు తెచ్చేవాడని.. ఆ టైంలో ఎక్కడైనా సరే అన్నం వేస్ట్ చేసినట్లు కనిపిస్తే ప్రభాస్ కి పిచ్చ కోపం వచ్చి స్పాట్లోనే వాళ్లను అరిచేసేవాడని. మిగతా టైంలో అంత సరదాగా ఉన్న ప్రభాస్ ఒక్క ఫుడ్ విషయంలోనే వేస్ట్ చేయగానే అంత కోప్పడిపోతారా అంటూ అక్కడ ఉండే జనాలు చెప్పుకునే వారని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు ప్రభాస్ కి అదొక వ్యసనమట. ప్రభాస్ ఎప్పుడు ఒక్కడే కూర్చుని తినడట . ఎవ్వరైన సరే పదిమందిని జత చేసుకొని పదిమందికి పెడుతూ తాను తింటేనే తనకి తిన్న ఫీలింగ్ వస్తుందని ప్రభాస్ చెప్తాడట. ప్రస్తుతం ఈ నటి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news