Moviesభర్త చేసిన మంచిపని..కత్రినా పబ్లిక్ లోనే ముద్దులే ముద్దులు..!?

భర్త చేసిన మంచిపని..కత్రినా పబ్లిక్ లోనే ముద్దులే ముద్దులు..!?

కత్రినా కైఫ్ ..ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలమే అయినా.. ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది.. అంటే ఆమెకు నటన పట్ల ఉన్న ఆశ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇన్నాళ్ల తన సినీ కెరియర్లో కత్రినా కైఫ్ ఎన్నో అవార్డు అందుకుంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అభిమానుల చేత శభాష్ అనిపించుకుంది.

కాగా రీసెంట్ గా తాను ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకున్న కత్రినా ప్రస్తుతం మ్యారిడ్ లైఫ్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటున్నా మరోపక్క భర్తతో హనీమూన్ లంటూ.. టూర్ లంటూ.. ఫారిన్ ట్రిప్స్ వేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే వాళ్ళు దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తుంది. రీసెంట్ గా కత్రినా భర్త విక్కీ కౌశల్ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. బాలీవుడ్ 67వ ఫిలింఫేర్ అవార్డుల ప్రధాన కార్యక్రమం మంగళవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్ లో కత్రినా భర్త విక్కీ కౌశల్ కు ఉత్తమ నటుడు క్రిటిక్ ఛాయిస్ టైటిల్ ని గెలుచుకున్నాడు.

దీంతో కత్రినా అతనికి స్టేజ్ పైనే ముద్దులు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎంత భర్త ఫస్ట్ టైం ఫిలింఫేర్ అవార్డు అందుకుంటే మాత్రం పబ్లిక్ లోనే ఇలాంటి పనులా.. కత్రినా అంటూ కొందరు మండిపడుతుంటే. భర్తను ఎంకరేజ్ చేస్తున్న భార్యగా కత్రినాను మరికొందరు అప్రిషియేట్ చేస్తున్నారు. విక్కీ కౌశల్ సర్దార్ ఉదయం సింగ్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ ఛాయిస్ నుంచి అవార్డు అందుకున్నాడు. విక్కీ తన అవార్డు ట్రోఫీతో తన సీటుకు తిరిగి వచ్చిన వెంటనే కత్రినా తన బుగ్గలపై ముద్దులు పెట్టి విక్కిని విష్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news