Moviesమనసుకు నచ్చిన ప్రతి ఒక్కరితో అలా చేయలేను కదా..కర్మ కర్మ ఏం...

మనసుకు నచ్చిన ప్రతి ఒక్కరితో అలా చేయలేను కదా..కర్మ కర్మ ఏం మాట్లాడుతున్నావ్ జాన్వీ..?

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.. స్టార్ డాటర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ క్యూట్ బేబీ.. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా..అతి తక్కువ సినిమాలు చేసింది. తండ్రి స్టార్ ప్రొడ్యూసర్.. తల్లి స్టార్ హీరోయిన్ అయినప్పటికీ జాన్వీ కపూర్ ఆ స్టేటస్ ని వినియోగించుకోలేకపోయింది. నిజానికి జాన్వీ కపూర్ కి బడా బడా సినిమాల్లో ఆఫర్లు వచ్చినా.. ఆమె తన హెడ్ వెయిట్ తో కధ నచ్చడం లేదంటూ లేనిపోని క్రేజీ కండిషన్స్ పెట్టి మంచి మంచి సినిమా అవకాశాలను వదులుకుందంటూ బాలీవుడ్ మీడియా వర్గాల్లో ఓ వార్త వైరల్ గా మారింది.

కాగా జాన్వీ కపూర్ సినిమాల కంటే ఫోటో షూట్ ల పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుందని జనాలు అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. జాన్వీ పట్టుమంటే పది సినిమాలు కూడా చేయలేదు కానీ ఫోటో షూట్ లు మతత్రం.. వామ్మో బోలెడు చడ్డీలు మిడ్డీలు వేసుకుంటూ తన అందాలని ఎక్స్పోజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా.. గుడ్ లక్ జెర్రి అనే సినిమాతో జనాల ముందుకు వచ్చింది. సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేం కానీ సినిమాల్లో తనదైన స్టైల్ లో నటించి జనాలని మెప్పిస్తుంది.

కాగా ఈ అమ్మడు త్వరలోనే మన ముందుకు మరో సినిమాతో రాబోతుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్న ఈ బ్యూటీ రీసెంట్ గా.. రియాల్టీ షోలో పాల్గొంది. ఈ క్రమంలోనే అమ్మడు డేటింగ్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.


” మా ఇంట్లో వాళ్లకి డేటింగ్ అంటే నచ్చదు అంటూ బిగ్ బాంబు పేల్చిన జాన్వీ.. నా మనసుకు నచ్చిన వ్యక్తి ఎవరైనా దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేస్తానని నాన్న మాటిచ్చారంటూ చెప్పుకొచ్చింది”. అయితే ,”నా మనసుకు నచ్చిన ప్రతి వ్యక్తిని పెళ్లి చేసుకోలేను కదా ఈ విషయం మా ఇంట్లో వాళ్లకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో.. నాది అంతా లైక్ అండ్ చిల్డ్ పాలసీ,,కానీ మా ఇంట్లో వాళ్ళు అంత ట్రెడిషనల్ పద్ధతులు అంటూ కూర్చుంటారు. ప్రస్తుతానికి నేను సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చిన సినిమాలు చేసుకుంటూ సింగిల్ గా హ్యాపీగా ఉన్నాను “అంటూ చెప్పుకొచ్చింది. దీంతో జాన్వీ బడా హీరోతో డేటింగ్ చేస్తుంది అంటూ వచ్చిన రూమర్స్ కి చెక్ పెట్టిన్నట్లు అయ్యింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news