Moviesఅత‌డితో పాయ‌ల్ స‌హ‌జీవ‌నం... అలాంటోడిని ప్ర‌తి అమ్మాయి కోరుకుంటుంద‌ని ప‌చ్చిగా చెప్పేసింది..!

అత‌డితో పాయ‌ల్ స‌హ‌జీవ‌నం… అలాంటోడిని ప్ర‌తి అమ్మాయి కోరుకుంటుంద‌ని ప‌చ్చిగా చెప్పేసింది..!

టాలీవుడ్‌ హాట్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి అందరికీ తెలిసిందే. తన అందంతో రచ్చ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. అలాగే తన పోస్టులతో కూడా ఆమెన్ హాట్ హాట్ గానే దర్శనమిస్తూ ఉంటుంది. తొలిసారిగా పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన పాయల్‌ ఆ తర్వాత తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఆమె అందాల ఆరబోత దెబ్బతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

ఆర్ఎక్స్ 100 సినిమాలో ఆమెకు వచ్చిన క్రేజ్ మామూలుగా లేదు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్‌లో కూడా మెప్పించింది. వెంకటేష్ కి జోడిగా వెంకీమామ, రవితేజకు జోడిగా డిస్కోరాజా సినిమాలలో కూడా నటించింది. కావలసినంత అందంతో పాటు అందాల ఆరబోత.. చూడ చక్కని ఫేస్ అయినా కూడా పాయ‌ల్‌ కు తెలుగులో పెద్ద అవకాశాలు రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోలతో రచ్చ చేస్తూ కుర్రాళ్ళ గుండెలను మెలిపెడుతూ ఉంటుంది.

ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు ఆమె సందడి చేస్తూ ఉండడంతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. గతంలో తన చిన్ననాటి స్నేహితుడు సౌరబ్ డింగ్రా ప్రేమలో ఉన్నట్టు పెద్ద బాంబు పేల్చింది. అత‌డితో ఒంటరిగా ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం పాయల్ అతడితోనే సహజీవనం కూడా చేస్తోంది. ఇక తన ఫాలోవర్ల‌తో ఎప్పటికప్పుడు ముచ్చట్లు పెట్టే పాయల్ తాజాగా ఒక నెటిజన్ విజయ్ దేవరకొండ గురించి అడగడంతో షాకింగ్ రిప్లై ఇచ్చింది.

ప్రతి అమ్మాయి విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తిని కోరుకుంటున్నాను అని చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తుంది. మొత్తానికి పాయ‌ల్ విజయ్ స‌ర‌సన నటించకపోయినా ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు విజ‌య్‌ అభిమానుల్లో ఎక్కడాలేని ఉత్సాహం కలుగజేస్తున్నాయి. ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న పాయ‌ల్ ఏంజెల్ – కిరాతక – గోల్‌మాల్ లాంటి సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంది. అటు కన్నడ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది. మరి ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో ఎప్పుడు ? ఛాన్స్ వస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news