Moviesఇస్మార్ట్ బ్యూటీస్ నిధి, న‌భాల‌లో చేజేతులా కెరీర్ స్పాయిల్ చేసుకుంది ఎవ‌రు...!

ఇస్మార్ట్ బ్యూటీస్ నిధి, న‌భాల‌లో చేజేతులా కెరీర్ స్పాయిల్ చేసుకుంది ఎవ‌రు…!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌కి క్రేజ్ రావడం అంటే అంత ఈజీ కాదు. నూటికి తొంబై శాతం ఒక హీరోయిన్ లైఫ్ ని డిసైడ్ చేసేది మొదటి రెండు సినిమాల సక్సెసే. ఆ సినిమాలు హిట్ అయితే ఆ హీరోయిన్ అందరూ నెత్తిమీద పెట్టుకుంటారు. లేదంటే కన్నెత్తి కూడ చూడరు. దీనికి ఉదాహరణ ఇటీవల కాలంలో వచ్చిన కృతిశెట్టి. మొదటి సినిమా ఉప్పెన బ్లాక్ బస్టర్ సాధించడంతో ఆ తర్వాత వరుసగా సినిమాలకి సైన్ చేసింది. ఆ తర్వాత కూడా రెండు సినిమాలు వరుసగా హిట్ కావడంతో ఇక డైరీ ఖాలీ లేకుండా పోయింది.

అదే ఫ్లాప్స్ పడితే, పెట్టె సర్దుకోని వెళ్ళిపోయేది. ఇక్కడ ఒక హీరోయిన్ సక్సెస్ లైఫ్ లీడ్ చేయాలంటే చాలా లెక్కలుంటాయి. హిట్ హీరోయిన్ అనిపించుకోవాలి. దర్శకుడు ఇచ్చిన సక్సెస్‌ను కాపాడుకునేలా సినిమా కథలను ఎంచుకోవాలి..రెమ్యునరేషన్ విషయంలో మరీ డిమాండ్ చేసి నిర్మాతలకి చుక్కలు చూపించకూడదు.. ఇలాంటి బార్డర్ లెక్కలన్నీ ఉంటాయి. ఇలా కాకుండా హిట్ పడగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం.. చక చకా సినిమాలు చేసి కోట్లు వెనకేసుకోవాలి అనే ఆలోచన ఉన్న హీరోయిన్స్ కెరీర్ ఎప్పుడు ఇబ్బందుల్లో పడుతుందో ఉదాహరణగా చాలామందిని చూడొచ్చు.

వీరిలో ఇస్మార్ట్ బ్యూటీస్‌గా ఒకే సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న నభా నటేష్ – నిధి అగర్వాల్‌లను కంపేర్ చేసి చూడొచ్చు. హైదరాబాదీ అమ్మాయి అయిన నిధి అగర్వాల్ మోడలింగ్ అటునుంచి హిందీ సినిమాలో ముందు హీరోయిన్‌గా నటించే అవకాశం అందుకుంది. మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అక్కినేని సోదరులతో నటించింది. కానీ, ఆ రెండు సినిమాలి ఫ్లాపయ్యాయి. అయినా పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అవకాశం ఇచ్చాడు.

అలాగే, నభా నటేశ్ కూడా. అదుగో, నన్నుదోచుకుందువటే సినిమాలు చేసిన రాని సక్సెస్ ఒక్క ఇస్మార్ట్ శంకర్ సినిమాతో దక్కింది. ఇద్దరికీ మాస్ అండ్ గ్లామర్ బ్యూటీస్‌గా పూరి మంచి క్రేజ్ తెచ్చిపెట్టారు. కానీ, నభా అత్యాశకి పోయి వచ్చిన క్రేజ్ మొత్తం పోగొట్టుకుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరుసగా సినిమాలు ఒప్పుకుంది. అంతేకాదు, నిర్మాతలను భారీగా రెమ్యునరేషన్ కావాలని డిమాండ్ చేసింది. దాంతో చక చకా చేసిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. దాంతో దర్శకనిర్మాతలు తీసి పక్కనపెట్టారు.

ప్రస్తుతం ఈ బెంగుళూరు భామ ఖాళీగా ఉంది. అదే నిధి ఒక్కో సినిమాను ఎంచుకుంటూ రెమ్యునరేషన్ విషయంలోనూ మేకర్స్‌ను ఇబ్బందిపెట్టకుండా తెలివిగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు చేస్తున్న పాన్ ఇండియా సినిమాకు నిధి తీసుకుంటున్న రెమ్యునరేషన్ తక్కువేనట. తమిళంలో చేసిన రెండు సినిమాలు కూడా హిట్ సాధించాయి. అక్కడ కూడా నిధికి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు అడ్రస్ వెతుక్కుంటుంది మాత్రం నభా నటెష్ దే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news