Moviesసమంత ఏంట్రా బాబు..నచ్చితే ఎవరితోనైనా రొమాన్స్‌కి రెడీ అంటోంది..!

సమంత ఏంట్రా బాబు..నచ్చితే ఎవరితోనైనా రొమాన్స్‌కి రెడీ అంటోంది..!

సమంత ఏంట్రా బాబు..నచ్చితే ఎవరితోనైనా రొమాన్స్‌కి రెడీ అంటుంది..! అనే కామెంట్స్ ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నెటిజన్స్ సమంతను బాగా ఫాలో అవుతున్నారు. తను ఏ సినిమా కమిటవుతుందీ..అందులో హీరో ఎవరూ అనే విషయాలు బాగా పరిశీలిస్తున్నారు. దీనికి కారణం మళ్ళీ నాగ చైతన్యతో కలిసి నటిస్తున్నట్టు ఊహించని ప్రకటన ఏదైనా వస్తుందేమో అనే అత్యత్సాహం.

కానీ, అభిమానులకు ఆ కోరిక తీరే అవకాశాలు దాదాపు లేనట్టే. ఇద్దరు ఎవరి జీవితాలలో వారు అటు వ్యక్తిగతంగా, సినీ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. అయితే, సమంత సినిమాలను గమనిస్తే ఓ విషయం చాలా క్రియర్‌గా అర్థమవుతుంది. నాగ చైతన్యతో విడాకులకు ముందు విడాకుల తర్వాత అనేట్టుగా సినిమాలను ఎంచుకుంటున్న తీరు కాస్త ఆశ్చర్యంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సమంత కథ నచ్చితే..ఏ హీరోతో అయినా రొమాన్స్ చేయడానికైనా ఒకే అంటుంది.

దీనికి ఉదాహరణ జాను సినిమానే తీసుకోవచ్చు. అప్పటికి నాగ చైతన్యతో విడాకులు కాకపోయినా శర్వానంద్ సరసన తమిళ హిట్ సినిమా రీమేక్ జానులో శర్వానంద్ సరసన నటించింది. ఈ సినిమాలో ఇద్దరి మధ్య ఓ లిప్ కిస్ కూడా ఉంటుంది. కానీ, దాన్ని సినిమాలో తొలగించారు. ఇక ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమాలో కూడా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేవి మలయాళ నటుడు దేవ్ మోహన్ సరసన నటిస్తుంది.

సమంత రేంజ్‌కు అలాంటి హీరో సరసన నటించడానికి ఒప్పుకోరు. కానీ, ఆమె ఒప్పుకోవడం షాకింగ్ విషయం. ఇక విజయ్ దేవరకొండ సరసన అనేది కూడా చాలామందికి జీర్ణించని విషయం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మహానటి సినిమాలో చూసినా ఇప్పుడు ఇద్దరు కలిసి నటిస్తున్న రొమాంటిక్ మూవీ ఖుషి లో సమంత, విజయ్ దేవరకొండలను చూస్తారా అంటే కథ మీదే ఆధారపడి ఉంది. అంతేకాదు, ఇప్పుడు బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా సరసన సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే వరుణ్ ధావన్ సరసన వెబ్ సిరీస్ చేస్తుంది. ఇది ఊహించని కాంబో. ఇదే కాదు, సమత – ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించేది నిజమైతే ఈ కాంబోను వరూ ఊహించరు. మొత్తానికి సమంత కథలను బట్టే అవతల హీరో ఎవరున్నారు అని కూడా ఆలోచించకుండా సినిమాలను ఒప్పుకుంటుంది. ఈ సినిమాలు హిట్ అయితే ఒకే. లేదంటే సోషల్ మీడియాలో రేగే దుమారం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news