Moviesరమ్యకృష్ణ - విజయశాంతి ఫ్యామిలీ లైఫ్‌లో ఏం జ‌రుగుతోంది.. ఆ కామ‌న్...

రమ్యకృష్ణ – విజయశాంతి ఫ్యామిలీ లైఫ్‌లో ఏం జ‌రుగుతోంది.. ఆ కామ‌న్ పాయింట్ ఇదే..!

రమ్యకృష్ణ, విజయశాంతి జీవితంలో ఎవరికి తెలియని ఒక కామన్ విషయం ఉంది అదేంటో తెలుసా ?
టాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ జీవితాలు తెల్లటి పేపర్ లాంటివి అని అంటుంటారు. వాస్తవానికి వారి జీవితాల్లో ఏం జరిగినా ఇట్టే మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరిగిపోతుంది అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయాలను బట్టి చూస్తే అదంతా వట్టి అబద్ధం అనే చెప్పవచ్చు.

ఎందుకంటే మనం ఎప్పుడు చూసే ఈ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనే విషయం పూర్తిగా గోప్యంగా ఉంచుతారు. చివరికి వారు విడాకులు తీసుకున్నారా ? లేదంటే కలిసుంటున్నారా ? అనే విషయం కూడా బయట ప్రపంచానికి తెలియడానికి ఎలాంటి క్లూ కూడా ఇవ్వడం లేదు. అలా ఇప్పుడు కొంత మంది సెలబ్రిటీస్ విషయంలో ఏం జరిగిందో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రమ్యకృష్ణ- కృష్ణవంశీ :
ఇండస్ట్రీలో దర్శకుడు కృష్ణ వంశీ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి తెలియని వారు ఉండరు. వీరిద్దరూ కొన్నేళ్లపాటు ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక కుమారుడికి జన్మనిచ్చారు అనే విషయం కూడా మన అందరికీ తెలుసు. కానీ అసలు వీరిద్దరూ కలిసి ఉన్నారా లేదా విడాకులు తీసుకున్నారా ? కలిసి దూర దూరంగా ఉంటున్నారా లేదా విడాకులు తీసుకుని విడిపోయారా అనే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఎవ్వరి దగ్గర కూడా సరైన సమాధానమైతే లేదు. ఎందుకంటే కృష్ణవంశీ హైదరాబాద్ లోనే ఎప్పుడూ ఉంటాడు.

 

అలాగే రమ్యకృష్ణ మద్రాస్ లోనే ఎప్పుడు ఉంటుంది. వీరి కుమారుడు కూడా చెన్నైలోనే చదువులు కొనసాగిస్తున్నాడు. వీరి మధ్య రాకపోకలు కూడా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఎక్కడ వీరి ఫొటోస్ కూడా ఎప్పుడు బయటకు రావు దాంతో అభిమానుల్లో చాలా సందేహాలు కలుగుతున్నాయి. వారి అభిమాన నటీనటులు సెలబ్రిటీస్ విడిపోయిన లేక కలిసి ఉన్న అది సంచలనమే కాబట్టి వీరి విషయంలో అదో పెద్ద మిస్టరీగా మారిపోయింది. అయితే మ‌ధ్య‌లో ఓ హీరోయిన్ వ‌ల్ల వీరి కాపురంలో క‌ల‌త‌లు వ‌చ్చాయ‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజాగా కృష్ణ‌వంశీ 21వ సినిమా రంగ‌మార్తాండ‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌డంతో వీరి బంధం బ‌లంగానే ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

విజయశాంతి-శ్రీనివాస్ :
మన లేడి అమితాబ్ విజయశాంతి జీవితం కూడా ఎప్పుడూ తెరవెనక రహస్యమే ఎందుకంటే విజయశాంతి పెళ్లి, ప్రేమ, పిల్లలు, జీవితం అనేది ఎప్పుడూ కూడా బయట ప్రపంచానికి చెప్పడానికి ఆమె ఇష్టపడదు. అలాగే విజయశాంతి తన భర్తతో కలిసి ఇప్పటివరకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. అలాగని వారి ఫొటోస్ కూడా ఎలా ఉన్నాయో కూడా ప్రేక్షకులకు అభిమానులకు తెలిసే అవకాశం లేదు. ఇప్పటివరకు వారు తీయించుకున్న పెళ్లి ఫోటో తప్ప ఇద్దరు కలిసి మీడియాలో ఎక్కడ కూడా కలిసి కనిపించింది లేదు.

దాంతో వీరిద్దరు కలిసి ఉంటున్నారా ? విడిపోయారా ? వీరికి ఎందుకు పిల్లలు కలగలేదు వద్దనుకున్నారా ? ఇలాంటి అనేక సందేహాలు జనాల్లో ఉన్నప్పటికీ వీటిపై ఎప్పుడు కూడా విజయశాంతి క్లారిటీ ఇవ్వడం లేదు. ఏది ఏమైనా కూడా ఆ హీరోయిన్స్ లైఫ్ ఎంతలా మూసిన పుస్తకం అనేది విజయశాంతి ని చూస్తేనే ఇట్టే అర్థమవుతుంది. వీరిద్దరూ మాత్రమే కాదు టాలీవుడ్ లో కాని, కోలీవుడ్ లో కానీ అనేక మంది సెలబ్రెటీస్ వారి వారి పర్సనల్ లైఫ్ ని మీడియాలో పెట్టడానికి ఇష్టపడటం లేదు. వారికి సంబంధించిన ఏ విషయం కూడా బయటకు తెలియకుండానే జాగ్రత్త పడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news